EPAPER

GHMC: వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్‌!

GHMC: వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్‌!

TG High Court Serious On Dogs Attack(TS news updates): హైదరాబాద్‌ మహానగరంలో ఉపాధి కోసం వచ్చి నివసిస్తున్న జనాభా కోటికి పైగా పెరిగిపోయింది.ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక సమస్యలున్నాయి. అందులో శుభ్రత లేక అనేకమంది ప్రతి సంవత్సరం అనేక జబ్బుల బారినపడుతున్నారు. ఇదేకాక కుక్కల సమస్య కూడా ప్రతి ఏడాది ఉత్ఫన్నమవుతోంది. కుక్కల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.ఈ క్రమంలోనే వీధి కుక్కల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు..వాటిని నియంత్రించేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.పిల్ విచారణ సందర్భంగా వీధి కుక్కల దాడిలో గడిచిన రెండు ఏళ్లలో చిన్న పిల్లలు మృతి చెందిన ఘటనలను గుర్తుచేసిన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొన్న న్యాయస్థానం విధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో బల్ధియాపై హైకోర్టు సీరియస్‌గా ఉంది.


జీహెచ్‌ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని,నిత్యం వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే న్యాయవాది హైకోర్టులో పిల్‌ వేశారు.ఈ పిల్‌పై బుధవారం విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ ఏడాది ఫిబ్రవరి 19న బాగ్‌ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటనను గుర్తు చేసిన పిటిషనర్ ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి,అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించుకున్నాడు.ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణ చర్యలపై హైకోర్టుకు నివేదిక ఇచ్చింది.

Also Read: వావ్! కొండా సురేఖ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు


గడిచిన పదేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 3లక్షల 36వేల 767 మందిని కుక్క కరిచిన కేసులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎంలో నమోదయ్యాయి.అందులోని కొన్ని కేసులు కోతులు,పిల్లులు కరిచినవి కూడా ఉన్నట్లు జీహెచ్ఎంసీ వివరాలను వెల్లడించింది.ఈ నగరంలో సుమారు 6 లక్షల శునకాలు ఉన్నట్లు,ఏడేళ్ల క్రితం 5.8 లక్షలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా రూ.10 కోట్లను ఖర్చు చేస్తుంది.గడిచిన రెండేళ్లుగా రూ.11.5 కోట్ల వార్షిక వ్యయాన్ని అధికారులు లెక్కల్లో పరిగణించారు.మొత్తం ఐదు జంతు సంరక్షణ కేంద్రాల్లో రోజు సుమారు 400 శునకాలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ శస్త్ర చికిత్సలు చేస్తున్నామని తద్వారా వాటి సంతతిని కంట్రోల్‌ చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు,అధికారులు చెబుతున్న లెక్కలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని మరికొందరి వాదన.నగరంలో పిల్లలు,పాదచారులు,వృద్ధులు,మహిళలను కరుస్తున్నాయి. కొత్త వ్యక్తులు ఎవరు కనిపిస్తే వారి వెంటపడుతున్నాయి.ఈ పదేళ్ల కాలంలో వీధి కుక్కల దాడికి గురై 8 మంది చనిపోయినట్లు ఐపీఎం లెక్కలు చెబుతున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు 50 వాహనాలు, 362 మంది సిబ్బందితో పాటుగా కేవలం 22 మంది వైద్యులు మాత్రమే ఉండటంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న యంత్రాంగంతో ముమ్మర ఏబీసీ ఆపరేషన్లు కుదరవని నగరవాసులు చెబుతున్నా.. ఎవరు కూడా చెవిన పెట్టిన పాపానా పోలేదు. సాధారణంగా కుక్కలు ఏడాదికి రెండుసార్లు గర్భం దాల్చుతాయి. ఆ రెండు సీజన్లు కంప్లీట్‌ అయ్యేలోపు అన్నింటికీ ఏబీసీ శస్త్ర చికిత్సలు జరుగాల్సి ఉంది. గోవా, బెంగుళూరు తదితర నగరాల్లో మాదిరి గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆధునిక విధానాలను ఉపయోగించి రెండు సీజన్లలో అన్నింటికీ ఏసీబీ ఆపరేషన్లు పూర్తి చేయాలని ఎన్జీవోలు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని అస్సలు వదిలిపెట్టబోమని పిల్లల శ్రేయస్సు కోసం ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.ఈ వ్యవహారాన్ని ఓ కేసుగా కాకుండా మానవీయ కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీధి కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 18 వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×