EPAPER

TS AP news: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

TS AP news: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..
big tv chota news

TS AP news: గురువారం కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై ఏరియల్ సర్వే చేస్తారు. అధికారులు, రైతులను కలిసి పంట నష్టంపై పూర్తి వివరాలు తెలుసుకుంటారు.


TSPSC పేపర్‌ లీక్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఘటనకు మంత్రి కేటీఆర్‌‌ని బాధ్యుడిగా చేయాలని కోరారు. ఐటీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా లీక్‌ జరగదని.. మంత్రిని కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

పేపర్‌ లీక్‌పై సిట్‌తో కాకుండా.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ చీఫ్ బండ్‌ సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రశ్నాపత్రం లీకులో సుమారు 30 లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయని అన్నారు. “మా నౌకరీలు మాగ్గావాలె” పేరుతో ఈనెల 25న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.


TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా కమిషన్‌లో పని చేస్తున్న 42 మందికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌తో సంబంధాలున్న వారందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే శంకర్‌లక్ష్మిని రెండుసార్లు పిలిచి ప్రశ్నించిన సిట్.. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవారందరినీ ప్రశ్నిస్తోంది.

MLC ఎన్నికల్లో ఓటర్లు తిరుగుబాటు తీర్పు ఇచ్చారన్న టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే పునరావృతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాడులకు భయపడి ప్రభుత్వంపై పోరు ఆపబోమని సీబీఎస్‌ స్పష్టం చేశారు.

తెలుగురాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలను ప్రజలు జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి పండుగ చేసుకున్నారు. వివిధ పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాలను వేద పండితులు వినిపించారు.

దేశీయ ఉగాది పంచాంగం పేరుతో మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆదాయం అదానీకి, వ్యయం జనానికి బ్యాంకులకు అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి వ్యంగంగా ట్వీట్ చేశారు. అవమానం నెహ్రూకు, రాజపూజ్యం గుజరాతీ గుంపునకు అంటూ ఎద్దేశా చేశారు.

కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్‌గా బండి సంజయ్ సైతం ట్విట్టర్‌లో పంచ్‌లు వేశారు. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి.. అవమానం ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు.. రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు.. అంటూ బండి సంజయ్ సైతం అదే స్థాయిలో సెటైరికల్ రాశిఫలాలు చెప్పారు.

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఈడీ విచారణ జరుగతున్న తీరుపై వివరించారు. తదుపరి విచారణ ఎలా ఎదుర్కోవాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు.

బీజేపీ- జనసేన పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు స్పందించారు. ఏపీలో బీజేపీని అన్‌పాపులర్ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మేం విడిపోవాలని కొందరు అనుకుంటున్నారని.. వారి కోరిక ఫలించకపోవచ్చని అన్నారు. బీజేపీ- వైసీపీ ఒకటే అనేది అపోహ మాత్రమే అని సోము వీర్రాజు అన్నారు. కొందరికి మోడీ నచ్చినా.. ఏపీలో బీజేపీని మాత్రం ఎదగనివ్వడం లేదని అన్నారు.

జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అరెస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు కానిస్టేబుళ్లను నిర్భందించి దాడి చేసినందుకు గాను మల్లన్నను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మల్లన్నతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసారు. కోర్టులో హాజరు పరిచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మల్లన్నను చర్లపల్లి జైలుకు తరలించారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం సాగింది. దేశంలో కొవిడ్‌ సంబంధిత పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతపై ప్రధాని సమీక్షించారు. కొవిడ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

2023 ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణకు పద్మవిభూషణ్‌ పురస్కారం లభించగా పారిశ్రామిక వేత్త కేఎం బిర్లాకు పద్మభూషణ్ అవార్డు వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి చినజీయర్ స్వామి, కీరవాణి ఉన్నారు.

విజయవాడలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. 7 కోట్ల 48 లక్షల విలువైన 12 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో డ్రోన్ కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9 గంటలు దాటాక ఆలయ పరిధిలో డ్రోన్ తిరిగినట్లు సమాచారం. ఆలయ పరిధిలో డ్రోన్‌ ఎగరవేయడంపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ఎస్‌ఆర్ కాలేజీ సెంటర్‌ వద్ద ఇంటర్‌ ఎగ్జామ్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై ఓ లెక్చరర్ దాడి చేసింది. గేటు వద్దకు లెక్చరర్‌ను కానిస్టేబుల్ అనుమతించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది

ఏలూరు జిల్లా మర్రిబంధం గ్రామంలో విషాదం జరిగింది. ఆటోపై తాటిచెట్టు పడడంతో అందులో ఉన్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో తీన్మార్ మల్లన్న అరెస్ట్‌ను నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేశారు. ప్రశ్నించే గొంతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కుతోందని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లా కుబీర్‌లో ఉగాది పండుగ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన మల్ల యోధులు పాల్గొన్నారు. కుస్తీ పోటీల్లో గెలిచినవారికి గ్రామ కమిటీ నగదు బహుమతి అందజేసింది.

పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో నూకాంబికా జాతర ఘనంగా నిర్వహించారు. బర్మా, కాందిశికుల కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు, ఘటాలు, పోతరాజుల విన్యాసాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×