EPAPER

Delhi Liquor Scam : టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందా?.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిందా?

Delhi Liquor Scam : టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందా?.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిందా?

Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రధానంగా వినిపించింది. బీజేపీ నేతలు కవితను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. ఆమె విచారణ ఎదుర్కొంటారంటూ లీకులిచ్చారు. కవిత సన్నిహితుల ఇళ్లపై, కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. ఇలా టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పడు ఇదే స్ట్రాటజీని బీజేపీపై టీఆర్ఎస్ ప్రయోగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం వర్సెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేయాలని ప్రయత్నించింది. లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై ఆధారాలు ఉన్నాయి అంటూ బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు గుప్పించారు. కవిత కచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఏ మేరకు ఉందో ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదో జరగబోతోంది అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలు టిఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారాయి. ఆధారాలు ఉన్నాయని పదేపదే చెప్పడం, కవితకు సన్నిహితంగా ఉన్న వారిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడంతో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోయింది.

ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్ కు ఆయుధంగా మారింది. ఈ వ్యవహారంలో బీజేపీ కీలక నేతలను టార్గెట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది గులాబీ పార్టీ. నాటకీయ ఫక్కీలో సాగిన ఈ వ్యవహారంలో 2 ఆడియోలను రిలీజ్ చేసి పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని టిఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. పక్కా ఆధారాలు ఉంటే ఇప్పటికే బయటపెట్టాలి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉంటే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందో అదే తరహాలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసులు ఎప్పటికి తేలతాయో చూడాలి మరి. ఇలాంటి వ్యవహారాల్లో క్లాప్ కొట్టడమే కానీ ఎండ్ కార్డులు ఉండవని గతంలో అనేక కేసుల్లో రుజువైంది.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×