EPAPER

Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!

Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!

Ganesh Idol Immersion: గణపతి నిమజ్జనం రోజు హైదరాబాద్‌లో భక్తులంతా రోడ్డు మీదికి వస్తారు. తమ బొజ్జ గణపయ్యను వాహనంలో పెట్టి వెంటే వెళ్లుతారు. ముఖ్యంగా నిమజ్జనం చేసే ఏరియాలో నడుచుకుంటూనే వెళ్లుతారు. ఒక దాని వెనుక మరో వాహనం.. వెళ్లుతూ ట్రాఫిక్ ఫుల్ స్లోగా ఉంటుంది. కాబట్టి నిమజ్జనం కోసం వాహనాలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు నిమజ్జనం రోజైన ఈ నెల 17వ తేదీన అమల్లోకి వస్తాయి. మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.


హైదరాబాద్ పోలీసు పరిధిలో ఆంక్షలు ఇలా ఉంటాయి. కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఇంజిన్ బౌలీ, శంశీర్‌గంజ్, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొగల్‌పురా, లక్కడ్ కోటె, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జర్ హౌజ్, మిట్టి కా షేర్, కాలి కమాన్, ఒస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్ రోడ్స్, నయాపూల్, ఎస్ జే రోటరీ, అర్మాన్ హోటల్, ఎంజే బ్రిడ్జీ, దారుల్ షిఫా క్రాస్ రోడ్స్, సిటీ కాలేజీ, శివాజీ బ్రిడ్జీ, అఫ్జల్ గంజ్, పుత్లి బౌలి క్రాస్ రోడ్స్, ట్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోఠీ ఏరియాల్లో ఈ ఆంక్షలు ఉంటాయి.

అలాగే.. తోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, అజంతా గేట్, అబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, చాపెల్ రోడ్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, జీపీవో అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి స్టాచ్యూ, కవాడిగూడ, నారాయణగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఏరియాల్లో ఆంక్షలు ఉంటాయి. మరికొన్ని చోట్లా ఈ ఆంక్షలు ఉండనున్నాయి.


Also Read: Khairatabad Ganesh: వీకెండ్ @ ఖైరతాబాద్.. రేపటితో దర్శనాలు బంద్.. బడా గణేష్ పెద్దోళ్ల కోసమేనా ?

ఇక పార్కింగ్ ప్లేస్‌ల విషయానికి వస్తే.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఎంఎంటీఎస్ స్టేషన్ ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఆఫీసు వరకు, బుద్ధ భవన్ వెనుక, గౌసేవాస దన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఐమాక్స్ పక్కన పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది.

ఇదిలా ఉండగా, నిమజ్జనం సమయంలో మాసబ్ ట్యాంక్ దాటి, వీవీ స్టాచ్యూ, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, చాదర్‌ఘాట్, ఐఎస్ సదన్, వైఎంసీఏ నారాయణగూడ, తార్నాకలు దాటి ఆర్టీసీ బస్సులు రావు. ఇక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచివచ్చే వారు లేదా వెళ్లేవారు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దారులకు వెళ్లవద్దు. వాటికి బదలు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్డు ఉపయోగించుకోవాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేవారు బేగంపేట్, ప్యారడైజ్ ఫ్లై ఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×