EPAPER

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

టీపీసీసీ నూతన ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దురదృష్టం, దేశ ప్రజల దురదృష్టం గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద విలువలు లేకుండా అవలంబిస్తున్నారు. ఒకరు బీజేపీ కేంద్ర మంత్రి రణ్వీర్ బిట్టు, బీజేపీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్ లు తీవ్రవాదులు మాదిరిగా మారుతున్నారు. వారిపై ప్రధానిగా ఉన్న వ్యక్తి చర్యలు ఎందుకు తీసుకోలేదు? రాహుల్ గాంధీ దేశమంతా ఎదురు చూస్తున్న మన భవిష్యత్. అలాంటి రాహుల్ గాంధీని మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతుంది అంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు.


Also Read: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

ఇందిరా గాంధీ ఎందుకు చనిపోయింది..? ఆస్తుల కోసమా.. స్వప్రయోజనాల కోసమా…? ఈ దేశ భద్రత కోసం, అఖండ భారతదేశం కోసం కృషి చేసిన ఆమె తీవ్ర వాదుల చేతిలో చనిపోయారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశ చరిత్రలో ఎవరూ లేని విధంగా స్వాతంత్ర్య పోరాటంలో 16 సంవత్సరాలు నెహ్రూ జైల్లో ఉన్నారు. మోదీ, అమిత్ షా దేశం కోసం ఎప్పుడైనా జైలుకు వెళ్లారా? నెహ్రూను మరిపించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక శక్తిగా మారారు. భారత్ జోడొ యాత్రలో తెలంగాణలో నడిచిన తీరు చూశాం. ఆ యాత్రలో అందరినీ ఆకట్టుకునే విధానాన్ని చూశాం. రేపు దేశంలో మరింత శక్తిగా మారబోతున్నారని అందుకే ఈ బెదిరింపులు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ, మహారాష్ర లో శివసేన తుడ్చుకుపెట్టుకుపోతుంది. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఆ భయంతోనే రాహుల్ గాంధీపై మాటల దాడి చేస్తున్నారు.


రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినవారిపై పోలీసుల చర్యలు ఏవీ? గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. ప్రతిపక్ష నాయకుడి మీద మాటల దాడి జరుగుతుంటే ప్రధాని,హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేద? రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఏం ఎలగపెట్టారు? కేవలం మతం అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చారు. నేను, మంత్రి పొన్నం ప్రభాకర్ హిందూమతంలోనే పుట్టినం.. రోజూ గుడిలో పూజలు చేస్తాం. మాట్లాడితే కులం, మతం పేరు చెప్పి రెచ్చగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మోసం చేస్తున్న విధానాలను ఎండగడుతాం. వేరే మతం, వేరే కులం గురించి మాట్లాడే హక్కు, కించపరిచే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది. ఇలా మాట్లాడే వ్యక్తులు మనకు వద్దు.. ప్రజలు చైతన్యం కావాలి.

Also Read: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

కూడు, గుడ్డ కావాలి అంటే మనకి ఉద్యోగాలు కావాలి. బీజేపీ నేతలు తీవ్రవాదులుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యంలో ప్రధాన మంత్రి, హోంమంత్రి ఎందుకు కేసులు పెట్టడం లేదు.? ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది అని ప్రధాని హోంమంత్రి అనుకుంటే ఈ క్షణమే కేసులు పెట్టి జైలుకు పంపించాలి. గాడ్సే వారసులు అనుకుని కేసులు పెట్టకపోతే సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలి.
పాసిస్ట్ ప్రభుత్వంకి రోజులు దగ్గర పడ్డాయి. రానున్న రోజుల్లో అధికారంలోకి రామనే భావనతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా , దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలి’ అంటూ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×