EPAPER

Congress-Aimim : ఎంఐఎంతో దోస్తీ కుదరని పని : మహేశ్ కుమార్ గౌడ్

Congress-Aimim : ఎంఐఎంతో దోస్తీ కుదరని పని : మహేశ్ కుమార్ గౌడ్

ఎంఐఎంతో దోస్తీ
కుదరని పని !


– హైడ్రా టార్గెట్ పేదలు కాదు
– ఆక్రమించిన బడాబాబులు
– మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్‌ది అనవసర రాద్దాంతం
– అసలు ఆ ప్రతిపాదన తీసుకొచ్చిందే కేసీఆర్
– జిల్లాల పర్యటనల తర్వాతే పీసీపీ కమిటీలు
– స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ
– ఎంఐఎంతో పొత్తు ప్రస్తావనే వద్దు
– టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, స్వేచ్ఛ: ఏఐసీసీ నేతలంతా బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గ నియామకం ఆలస్యం అయిందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారనేది ప్రతిపక్ష పార్టీల ప్రచారమేనన్నారు. ఈ విషయంపై అధిష్టానం వివరణ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎంతో స్నేహం వేరు, శాంతిభద్రతలు వేరని చెప్పారు మహేష్ గౌడ్, ఫిరోజ్ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు.


కఠినంగా ఉంటాం…

దాడుల విషయంలో కఠినంగా ఉంటామని తెలిపారు. దసరాకు రెండో విడత కార్పొరేషన్ పదవులు అనుకున్నామని, కుదరలేదని, దీపావళి లోపు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళ్తానన్న టీపీసీసీ చీఫ్, భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి అని వివరించారు. మూసీ అభివృద్ధి‌ కోసం లక్షా 50 వేల కోట్లని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రేమతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని, ఎలాంటి ఒత్తడి లేదని వ్యాఖ్యానించారు.
పూర్తి కథనం…
————-

Related News

Mohammad Siraj DSP : డీఎస్పీగా సిరాజ్… నియామక పత్రాలిచ్చిన డీజీపీ జితేందర్

BJP BRS Alliance: బీఆర్ఎస్‌తో పొత్తా? నో.. నెవర్, హైడ్రా ఏమీ కొత్తదేం కాదు: బీజేపీ నేత కిషన్ రెడ్డి

Bhatti Vikramarka : పనిగట్టుకుని విమర్శలా ?

Telangana Jobs: గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Mahesh Kumar Goud : కొండా సురేఖను తొలగిస్తారని ప్రచారం… క్లారిటీ ఇచ్చేసిన పీసీసీ చీఫ్

Telangana: సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజులే సమయం!

Big Stories

×