EPAPER
Kirrak Couples Episode 1

Anumala Revanth Reddy : సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ..

Anumala Revanth Reddy : సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ..

Anumala Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. అదేమీ పట్టించుకోకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. స్కూలు పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉంటే.. ఆ పరిస్థితులపై ఒక్క సారి కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదని లేఖలో పేర్కొన్నారు.


చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవన్న విషయాన్ని రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలల్లో చెట్ల కిందే వంటలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఏరియర్స్‌ తో సహా వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందన్నారు. మెనూ ప్రకారం ఎక్కడా భోజనం పెట్టడం లేదన్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని, ఉడికి..ఉడకని భోజనాలు తిని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

విద్యార్థులు ఆహారంతో, హాస్టళ్ల నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఒక్కసారి కూడా వాటిపై సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. పెరిగిన ధరలకు తగ్గట్టుగా.. మధ్యాహ్న భోజనం బడ్జెట్ ను పెంచే ఆలోచనే సర్కార్ కు లేదన్నారు. కాగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.


Revanth Reddy Comments : వాళ్లది గల్లీలో కుస్తీ – ఢిల్లీలో దోస్తీ బంధం

Revanth Reddy Comments : బీఆర్ఎస్ , బీజేపీ బంధంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తుచేశారు. మంగళవారం నిజామాబాద్ సభలో ప్రసంగించిన మోదీ.. ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ తనను కలిశారని చెప్పడంతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. నేడు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీ బంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ సలహా లేనిదే కేసీఆర్ ఏదీ చేయరని, ఆ రెండింటిదీ ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను సీఎం చేస్తానంటూ ప్రధాని మోదీని సలహా అడిగిన విషయంపై కేసీఆర్ నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి.. కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నదే మోదీ ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని రేవంత్ ఆరోపించారు.

మోదీ, బీఆర్ఎస్ ఏకమైనపుడు ఎంఐఎం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. దీనికి ఎంఐఎం వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను గెలిపించేందుకే బీజేపీ పోటీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య పొత్తు కుదిరిందన్న రేవంత్‌.. బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం ఒక్కస్థానంలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బీజేపీ 4 సిట్టింగ్‌ స్థానాలతో పాటు మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, చేవెళ్ల స్థానాలను బీజేపీ అడిగినట్లుగా.. బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపీ తనకు చెప్పినట్లు రేవంత్ వెల్లడించారు. తన సిట్టింగ్‌ స్థానం కూడా బీజేపీకి ఇస్తామని అంగీకరించారనే విషయాన్ని చెప్పి.. ఆ ఎంపీ నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే.. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారించడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ దోపిడీలో మోదీకి కూడా వాటాలు వెళ్తున్నాయని, అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ – మోదీది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని.. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతిస్తారో ఆలోచించుకోవాలని రేవంత్ సూచించారు. రెండుపార్టీల బండారం బయటపడిందనే.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని, ఇప్పుడు తమ పార్టీని ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న విషయాన్ని ఓటర్లు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్తారని రేవంత్ తెలిపారు.

Related News

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Big Stories

×