EPAPER

Pet Dog Dispute in Hyderabad: పెంపుడు కుక్క వ్యవహారం.. దారుణంగా కొట్టుకున్న రెండు కుటుంబాలు..

Pet Dog Dispute in Hyderabad: పెంపుడు కుక్క వ్యవహారం.. దారుణంగా కొట్టుకున్న రెండు కుటుంబాలు..

Pet Dog issue with 2 Families in Hyderabad: పెంపుడు కుక్క వ్యవహారం రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఈ ఇష్యూ చినికి చినికి గాలివానగా మారింది. ఒకరిపై మరొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని రహమత్ నగర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది..? అసలు డీటేల్స్‌లోకి వెళ్తే..


హైదరాబాద్‌లోకి రహమత్ నగర్‌లో శ్రీనాథ్ తన ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు హస్కీ. ఇంట్లో పిల్లలు మాదిరిగా పెంపుడు కుక్కను చూసుకున్నారు. అయితే ఈనెల 8న పొరపాటున బెల్టు ఊడిపోయి బయటకు వెళ్ళింది ఆ శునకం. శ్రీనాథ్ ఇంటికి ఎదురుగా ఉన్న ధనుంజయ్ ఇంటికి వెళ్లి పెద్దగా అరిచింది. ధనుంజయ్ అనే వ్యక్తి శ్రీనాథ్ దంపతులను నానా మాటలాడారు. ఈ వ్యవహారం చివరకు పోలీసుస్టేషన్ వెళ్లడం ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కావడంతో ఈ ఇష్యూని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

సీన్ కట్ చేస్తే.. ఈనెల 14న శ్రీనాథ్, ఆయన వైఫ్ స్వప్న హస్కీతో కలిసి బయటకు వెళ్తున్నారు. ఈ సమయంలో ధనుంజయ్, ప్రవీణ్ అతని స్నేహితులు కలిసి కర్రలు విచక్షణా రహితంగా వారిపై దాడి చేశారు. పెద్దవాళ్లు వచ్చి వాళ్లను అడ్డుకున్నారు. వాళ్ల కొట్టిన దెబ్బలకు తీవ్రం కావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరికీ సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు.


Also Read: బీజేపీ దిగజారింది, పదేళ్లు ఏం చేశారంటూ..

ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మధురానగర్ పోలీసులు. దాడి చేసిన ధనుంజయ్, సాయికుమార్, ప్రవీణ్‌కుమార్, గౌరీ‌శంకర్, రాంబాబు‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అన్నట్లు ఈ మధ్యకాలంలో పెంపుడు కుక్కలను వారి యజమానులు బయటకు తీసుకువస్తున్నారు. ఆ సమయంలో దారిలో వెళ్లేవారిపై దాడికి పాల్పడుతున్న సందర్భాలు లేకపోలేదు.

ఆ మధ్య సన్ సిటీలో ఓ ఘటన జరిగింది. పెంపుడు కుక్కను యజమాని బయటకు తీసుకెళ్లే క్రమంలో ఓ వ్యక్తిపై దాడి చేసింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు.. పెంపుడు కుక్క ఉన్న యజమానితో గొడవపడ్డారు కొట్టుకునే వరకు వెళ్లింది. ఏదేమైనా పెంపుడు శుకనాల విషయంలో యాజమానులు జాగ్రత్తగా వ్యవహరించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు రిక్వెస్ట్ చేస్తున్నారు.

Also Read: 17 Accident black Spots: ఆ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్.. జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×