EPAPER

Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం

Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం

 Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాపైన బాలుడు క్షేమంగా దొరికాడు. ఎట్టకేలకు జీజీహెచ్‌లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు బాలుడు మణికంఠను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఏడాది బాలుడు మణికంఠను కిడ్నాప్ చేశారు. కొంతమంది మహిళలు కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీలో కనిపించారు. అయితే కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రాంతానికి చెందిన పిల్ల రాజు, లక్షిలు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. అయితే వీరిద్దరూ ఆస్పత్రిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ముగ్గురు మహిళలు వాళ్లమధ్యన నిద్రిస్తున్న బాలుడు మణికంఠను ఎత్తుకెళ్లారు.

తర్వాత లేచి చూడగా.. బాలుడు కనిపించకపోవడంతో ఆస్పతిలో వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో బాలుడు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీలో ఫుటేజీలను తనిఖీలు చేయగా.. ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Also Read: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

సీసీ కెమెరాల ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన బాలుడు మణికంఠను ఆ మహిళలు మహారాష్ట్ర తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని పట్టుకున్నారు.

Related News

GO 317 : సీఎం రేవంత్ చేతికి 317 జీవో కమిటీ నివేదిక

MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

Group 1 Exam : గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రభుత్వం భరోసా

 Hyderabad Mmts : రాజధాని భవిష్యత్‌కు ఎమ్ఎమ్‌టీఎస్ విస్తరణ అవశ్యం

Governor bandaru dattatreya: బండారు దత్తాత్రేయ కారుకు రోడ్డు ప్రమాదం.. ఢిల్లీ వెళ్తుండగా ఘటన

pubs task force raids: దారి తప్పుతున్న పబ్ కల్చర్.. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఏకంగా..!

Metro Police Hotel : మెట్రో పోలీస్ యజమాని అరెస్ట్, హోటల్ సీజ్, హైదరాబాద్ పోలీసులు, ముంబయికి వెళ్లి మరీ ?

Big Stories

×