EPAPER

TG Group 2 : తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా ?

TG Group 2 : తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా ?

Group 2 Postpone in Telangana : తెలంగాణ గ్రూప్ 2 వాయిదా పడనుందన్న వార్త ఉదయం నుంచి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది జులై నెలలో డీఎస్సీ, ఆగస్టు నెలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావించింది. ఈ మేరకు TGPSC ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. అభ్యర్థులు కూడా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ, ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలన్నది వారి డిమాండ్. నిరుద్యోగుల డిమాండ్ దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిరుద్యోగుల డిమాండ్ దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా వేస్తే.. మళ్లీ డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అభ్యర్థులకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరో 3 నెలల సమయం అదనంగా ఉంటుంది.

Also Read : హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా వెనుక కారణం అదేనా?


కాగా.. గ్రూప్ 2 పోస్టుల్ని 2000కు, గ్రూప్ 3 పోస్టుల్ని 3 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 లో :100 శాతంలో మెయిన్స్ కు ఎంపిక చేసి.. 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేయగా.. దానిపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యాశాఖతో దీనిపై చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో గ్రూప్ 2 వాయిదా వేస్తారా లేక డీఎస్సీ వాయిదా వేస్తారా అన్నదానిపై నేడు స్పష్టత రానుంది.

ఇక తెలంగాణలో గత నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఈ నెలలోనే విడుదల చేయనుంది. ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు వెళ్లనున్నారు. టీజీపీఎస్సీ మొత్తం 563 స్థానాలకు ప్రిలిమ్స్ నిర్వహించింది. జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది.

Related News

Olympics In Hyderabad: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

Hyderabad city development: తెలంగాణకు మహర్దశ.. హైదరాబాద్ నలువైపుల నుంచి రోడ్ల కనెక్షన్, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Big Stories

×