EPAPER

TG Replaces TS: ఇక నుంచి TS కాదు TG.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

TG Replaces TS: ఇక నుంచి TS కాదు TG.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

TG Replaces TS: ఇక నుంచి టీఎస్ నుంచి టీజీగా ప్రస్తావించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఇక నుంచి తెలంగాణను టీఎస్ కు బదులుగా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా కూడా టీఎస్ కు బదులు టీజీగా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, ఏజెన్సీలు, అటానమస్ విభాగాలన్నింటిలోనూ వెంటనే అమలు చేయాలని అందులో పేర్కొన్నది. అదేవిధంగా నోటిఫికేషన్లు, నివేదికలు, జీవోలు, లెటర్ హెడ్ లలో టీజీ అనే పేర్కొనాలని సీఎస్ స్పష్టం చేసింది.

అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసుల నేమ్ బోర్డ్స్, వెబ్ సైట్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో టీజీ ఉండాలని తెలిపారు. టీఎస్ అని ముద్రించి స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్ ను వెంటనే తొలగించి.. టీజీతో కొత్తగా ముద్రించాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేసి ఈ నెల 31 వరకు సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పించాల్సిందిగా వివిధ శాఖల కార్యదర్శులను ఆమె ఆదేశించారు.


Also Read: ఆ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్.. జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగలన్నీ కూడా టీఎస్ కు బదులుగా టీజీగా ప్రస్తావించనున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులలో నేమ్ బోర్డులలో టీఎస్ కు బదులు, టీజీ కనిపించనున్నది.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం కోడ్ అబ్రివేషన్ ను టీఎస్ కు బదులు టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో తెలంగాణ ఏర్పడినంక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోడ్ ను టీఎస్ గా నిర్ణయించింది. అప్పటి నుంచి అదే కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక TS పేరును TG మారుస్తూ మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Also Read: EX-Minister Mallareddy Arrest : భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్

అనంతరం తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో అంగీకరించింది. ఇందుకు సంబంధించి గెజిట్ ను కూడా విడుదల చేసింది. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రావడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లతోపాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, ఇతర ప్రభుత్వ సంబంధిత అంశాలలో కూడా రాష్ట్రం కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆఫీసులలో నేమ్ బోర్డులు, లెటర్ హెడ్స్, స్టాంపులు, ఏజెన్సీలు, నోటిఫికేషన్లు, నివేదికలు, జీవోలలో ఇక నుంచి టీఎస్ కు బదులు టీజీగా పేర్కొననున్నారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×