EPAPER
Kirrak Couples Episode 1

Kavitha: ఈడీ విచారణకు వేళాయే.. కవిత వెళ్తారా? అరెస్ట్ చేస్తారా?

Kavitha: ఈడీ విచారణకు వేళాయే.. కవిత వెళ్తారా? అరెస్ట్ చేస్తారా?

Kavitha: కవిత కేసు డైలీ సీరియల్‌లా ప్రతీ ఎపిసోడ్‌లోనూ ట్విస్టులు ఉంటున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఈడీ విచారణ ముగిసింది. అప్పుడే అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ చేయలేదు. మళ్లీ పిలుస్తామన్నారు. ఈనెల 16న రావాలని నోటీసులు ఇచ్చారు. కవిత వెళ్లలేదు. తన తరఫున లాయర్‌ను పంపించారు. అయితే సరే, మళ్లీ 20న రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదే సమయంలో ఇంట్లోనే విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. 24న విచారణ జరపనుంది సుప్రీం. ఈ కేసులో ఈడీ సైతం కేవియట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా తీర్పు ఇవ్వొద్దని సుప్రీంను కోరింది. ఇలా ఆసక్తికర పరిణామాల మధ్య 20వ తేదీ రానే వచ్చింది.


సోమవారం ఈడీ విచారణ. ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌లతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు కవిత. మరి, సోమవారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరే లాయర్‌ను పంపిస్తారా? కవిత డుమ్మా కొడితే ఈడీ ఊరుకుంటుందా? అరెస్ట్ చేస్తుందా? ఈనెల 24న జరగనున్న సుప్రీంకోర్టు విచారణ వరకు వెయిట్ చేస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు. అంతకుమించి ఉత్కంఠ.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అనుమానితురాలు అని ఇప్పటికే కోర్టుకు తెలిపింది ఈడీ. కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించింది. అరుణ్ రామచంద్ర పిళ్లై.. కవిత బినామీ అని తేల్చింది. అడిటర్ బుచ్చిబాబు, పిళ్లైల సమక్షంలో కవితను ప్రశ్నించాలని భావించింది ఈడీ. కానీ, సుప్రీంకోర్టులో పిటిషన్‌ను సాకుగా చూపించి.. గత విచారణను తప్పించుకుంది కవిత. ఈడీ పక్కాగా పావులు కదుపుతుండటంతో.. ఈసారి కూడా గైర్హాజరు అయితే కుదిరేలా లేదు. అందుకే, ఎందుకైనా మంచిదని తన పరివారంతో కలిసి ఢిల్లీ అయితే వెళ్లారు. సోమవారం విచారణకు హాజరు అవుతారా? లేదా? కవితను అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.


Related News

TGSRTC: దసరాకు 6 వేల స్పెషల్ బస్సులు.. ముందస్తు రిజర్వేషన్ కోసం సైట్ ఓపెన్..

HYDRA: ఆ ప్రచారాలను నమ్మొద్దు, వారి ఇళ్లను కూల్చం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

KTR: మూసీ పేరుతో బడా స్కెచ్.. రూ. లక్ష కోట్లు స్వాహా : కేటీఆర్

Konda Surekha: అన్నా, చెల్లిపై అలాంటి పోస్టులా? కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

Tension: సిద్ధిపేట జిల్లాలో టెన్షన్..టెన్షన్… గ్రామస్తుల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోయిన పోలీసులు.. చివరకు..

Telangana Bhavan: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్యకర్తలు?

Big Stories

×