EPAPER

Ministers Portfolios: కేంద్ర మంత్రులుగా తెలుగువారు.. శాఖలివే..

Ministers Portfolios: కేంద్ర మంత్రులుగా తెలుగువారు.. శాఖలివే..

Telugu States Ministers Portfolios: కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం సాయంత్ర ప్రధాని మోదీ, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరిగింది. ఆ తరువాత మంత్రులకు శాఖలు అప్పగించారు.


మోదీ ప్రభుత్వం గత పాలనలో మంత్రులుగా ఉన్న వారికే ఆ శాఖలను కట్టబెట్టింది. కీలకమైన హోం శాఖ మంత్రిగా అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్‌‌లు ఉండనున్నారు. కాగా గత ప్రభుత్వంలో కూడా వారు ఇవే శాఖలకు అధిపతులుగా పనిచేయడం గమనార్హం.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చోటు దక్కించుకోగా.. ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మలు చోటు దక్కించుకున్నారు. ఇందులో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు‌లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇక బండి సంజయ్, పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు సహాయ మంత్రులు దక్కాయి.


  • కిషన్ రెడ్డి- బొగ్గు, గనుల శాఖ మంత్రి
  • బండి సంజయ్- హోం శాఖ సహాయ మంత్రి
  • రామ్మోహన్ నాయుడు- పౌరవిమానయాన శాఖ మంత్రి
  • పెమ్మసాని చంద్రశేఖర్- కమ్యూనికేషన్, గ్రామీనాభివృద్ధి సహాయ శాఖ మంత్రి
  • శ్రీనివాసవర్మ- ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి

బండి సంజయ్, కిషన్ రెడ్డి, శ్రీనివాసవర్మలు బీజేపీ తరఫున మంత్రి పదవులు దక్కించుకోగా.. రామ్మోహన్ నాయుడు,. పెమ్మసాని చంద్రశేఖర్‌లు తెలుగుదేశం పార్టీ తరఫున ఏన్డీయే కూటమిలో భాగంగా మంత్రి పదవులు ఒడిసిపట్టుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండిసంజయ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.

Also Read: మంత్రులకు శాఖలు కేటాయింపు.

ఇక ఏపీలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ లోక్ సభ బరిలో నిలిచి గెలిచారు.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×