EPAPER

Telangana Man Dies In Desert: సౌదీ అరేబియా ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి.. ఫోన్ సిగ్నల్ లేక తీవ్ర ఎండకు..

Telangana Man Dies In Desert: సౌదీ అరేబియా ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి.. ఫోన్ సిగ్నల్ లేక తీవ్ర ఎండకు..

Telangana Man Dies In Desert| తెలంగాణకు చెందిన ఓ యువకుడు గల్ఫ్ దేశంలోని ఎడారిలో దారితప్పి నిస్సహాయ స్థితిలో చనిపోయాడు. 650 కిలోమీర్ల పాటు విస్తీర్ణంగా ఉన్న ఎడారిలో తన స్నేహితుడితో వెళ్లి అక్కడ దారితప్పిపోయాడు. ఆ తరువాత ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో.. సిగ్నల్ కోసం వెతుకుతూ మరింత వ్యతిరేక దిశలో వెళ్లిపోయాడు. చివరికి రోజుల తరబడి నీరు కూడా లేక తీవ్ర ఎండకు ఇద్దరూ చనిపోయారు. ఈ విషాద ఘటన సౌదీ అరేబియా దేశంలోని రుబా అల్ ఖాలీ ఎడారిలో జరగింది.


వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రాంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల మొహమ్మద్ షెహ్‌జాద్ ఖాన్ సౌదీ అరేబియా దేశానికి ఉద్యోగం కోసం 2021 సంవత్సరంలో వెళ్లాడు. అక్కడ ఒక టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగ నిమిత్తం.. అతను తరుచూ మొబైల్ టవర్ల వద్ద రిపేర్లు, సుదూర ప్రాంతాల్లో కొత్త టవర్ల ఏర్పాటు కోసం కారులో వెళుతుంటాడు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!


ఈ క్రమంలో కొన్ని రోజుల ముందు షెహ్ జాద్ ఖాన్, తనతో పాటు పనిచేస్తున్న సడాన్ దేశస్తుడుతో కలిసి రుబా అల్ ఖాలీ ఎడారి సమీపంలోకి వెళ్లాడు. అయితే వెళ్లిన ప్రదేశంలో ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో తన అధికారులతో మాట్లాడడానికి ఎడారి చుట్టూ కారులో తిరుగుతూ దారి తప్పిపోయాడు. చివరికి ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయింది.

సహాయం కోసం కారులో తిరిగి తిరిగి.. పెట్రోల్ కూడా అయిపోయింది. దీంతో ఎడారిలో కాలినడకన అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర ఎండకు నీరసించిపోయాడు. తనతో పాటు ఉన్న స్నేహితుడు కూడా ఓపిక నశించి కారు సమీపంలోనే ఉండిపోయాడు. చివరికి సహాయం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ.. నమాజు చేసే మ్యాట్ పై ఇద్దరూ ప్రాణాలు వదిలారు.

Also Read: Man Marries sister: వధువు చేయి చూసి పెళ్లి ఆపేసిన వరుడి తల్లి.. ఏం జరిగిందంటే..

అయితే షెహ్ జాద్, అతని మిత్రుడి కోసం వారి కంపెనీ వారు వెతుకుతూ.. నాలుగు రోజుల తరువాత వారి కారు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ హృదయ విదారక దృశ్యం చూసి చలించిపోయారు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

ఇలాంటిదే మరొక ఘటనలో ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లిన దుర్గేశ్ అనే భారతీయ యువకుడికి అతని యజమాని దొంగచాటుగా కతార్ తీసుకెళ్లాడు. అక్కడ దుర్గేశ్ తో బానిసలా పనిచేయించేవాడు. దీంతో దుర్గేశ్ తప్పించుకొని ఇండియన్ ఎంబసీకి చేరుకొని ఫిర్యాదు చేశాడు. అక్కడ ఇండియన్ ఎంబసీ వారు సౌదీ అరేబియా ప్రభుత్వానికి సమాచారం అందించగా.. అధికారులు దుర్గేశ్ ను కాపాడి భారత దేశానికి సురక్షితంగా పంపించారు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

 

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×