EPAPER

Telangana State Debts : అప్పు చేసి.. దెప్పి చూడు..

Telangana State Debts : అప్పు చేసి.. దెప్పి చూడు..
ts news updates

Telangana State Debts(TS news updates):

లక్ష్యం కొండంత ఉంది. కానీ సంకల్పం ఉంటే సాధ్యమే. నిజానికి గత పదేళ్లలో ఆర్థిక విధ్వంసమే జరిగింది. అప్పుల కుప్ప పెరిగిపోయింది. పాత సంగతి అలా వదిలేసినా.. ఇప్పుడు కొత్త సంగతి చూద్దాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలలు ఉంది. అయినా సరే.. అప్పటిదాకా రావాల్సిన రాబడి లాగేసింది గత సర్కారు. పైగా కొత్తగా అప్పులు కూడా ఏవీ పుట్టకుండా అన్నీ ముందస్తుగానే తీసేసుకుంది. చెప్పాలంటే ఇప్పుడు కొత్త సర్కార్ కు సవాలే. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా..


వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతున్న మాట.. చిత్రంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కూడా దాదాపు అదే వంద రోజుల సమయం ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగియడానికి… 6 గ్యారెంటీల అమలుకు పెద్ద లింకే ఉంది. ఎందుకంటే.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. రాబడి తగ్గింది. ఖర్చులు పెరిగాయి. హామీల అమలుకు భారీగానే నిధులు అవసరం. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కష్టాలు ఎన్ని ఉన్నా.. అన్నిటినీ ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారు. ఖజానా ఖాళీ అయిందన్న నిరుత్సాహం లేదు. ఎలాగైనా అనుకున్నవి నెరవేర్చాలన్న సంకల్పమే బలంగా ఉంది.

ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల అమలుకు వేలాది కోట్ల రూపాయలు అవసరం అని అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నలను బీఆర్ఎస్ వినిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను దృష్టిలో పెట్టుకునే 6 గ్యారెంటీలను ఇచ్చామని అప్పట్లో కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎన్నికలకు ముందు గత కేసీఆర్ సర్కార్ తెచ్చుకున్న అప్పులు, లీజు డబ్బులు, భూముల అమ్మకాలతో వచ్చిన ఆదాయమంతా ఆవిరైపోయింది. ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. ఇది కొత్త ప్రభుత్వానికి ఒక సవాల్ గా మారింది.


అప్పటికే నాడు రేవంత్ రెడ్డి.. ఓఆర్ఆర్ దీర్ఘకాల లీజును పూర్తిగా వ్యతిరేకించారు. రాబోయే ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగేలా నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పు బట్టారు. నాడు రేవంత్ రెడ్డి అనుకున్నదే అయింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ మాత్రం ఈ సవాళ్లను అధిగమించే పనిలో ఉన్నారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలను ఎలాగైనా పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో ఉన్నారు. అసలు ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం.

ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్ గా పెట్టుకున్న అప్పులన్నింటినీ ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందే గత ప్రభుత్వం తీసుకుంది. కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్​ ఆరోగ్య శ్రీ వంటి గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ… వీటికి కొంతకాలం తర్వాత నిధులు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. దీంతో వీటిని వెంటనే పట్టాలెక్కించారు. అయితే రైతు భరోసా, గృహజ్యోతి, మహిళలకు ప్రతి నెలా 2,500 సాయం, 500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి వాటికి వెంటనే నిధుల అవసరం ఉంది.

గ్యారంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం… ఏవి ఎప్పుడు మొదలుపెట్టేందుకు ఛాన్స్ ఉంటుందన్న అంశంపై రిపోర్ట్​ రెడీ చేయాలని ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఓఆర్​ఆర్​ లీజు సొమ్ము, ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులను కూడా గత కేసీఆర్ సర్కారే ఖర్చు చేసింది. ఈ మొత్తం 19 వేల కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్​ పేపర్​ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ఏడాదికి కనీసం 60 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది.

కాంగ్రెస్​ ప్రభుత్వం గ్యారెంటీల్లో ప్రకటించిన అతిముఖ్యమైంది రైతు భరోసా. రాష్ట్రంలోని రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఎకరాకు 15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ యాసంగి సీజన్ ​కు సంబంధించిన రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జమ చేయాల్సి ఉంది. ఎకరాకు 7,500 చొప్పున కోటి 50 లక్షల ఎకరాలకు ఇవ్వాలి. ఇందుకు దాదాపు ఒక దఫాకే 11 వేల కోట్లు అవసరమవుతాయి.

అయితే రాష్ట్ర ఖజానాలో ఈ మొత్తంలో 30 శాతం కూడా నిధులు నిల్వ లేవంటున్నారు. అందులో నుంచే రాష్ట్రానికి సంబంధించిన ఇతర అవసరాలన్నీ తీర్చాల్సి ఉంది. వచ్చే నెలలోనైనా రైతు భరోసా అమలు చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఎంతోకొంత నిధులు రాబట్టుకుని.. యాసంగి సీజన్ పెట్టుబడి సాయాన్ని జనవరి చివర్లో రైతుల ఖాతాల్లో వేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు చాలా బాగా తెలుసు. అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటైన 2 రోజులకే రైతుబంధు డబ్బులు ఎందుకు వేయలేదని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డిసెంబర్ 9న రైతు బంధు డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారని, ఇంకా డబ్బులు వేయలేదన్నారు. రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.

కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వరకు కూడా.. సంక్షేమ పథకాల అమలుకు టైం తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియే. పథకాల అమలు విషయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాటి అమలు విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. అంతా సర్దుకోవడానికి టైం పడుతుంది. ఇవేవీ దృష్టిలో పెట్టుకోకుండా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై కాంగ్రెస్ మంత్రులు ఫైర్ అవుతున్నారు.

.

.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×