EPAPER

Telangana Politics : తుఫానుగా మారిన హస్తం గాలి.. గులాబీ పార్టీ ఓటమి ఖాయమైపోయిందా ?

Telangana Politics : తుఫానుగా మారిన హస్తం గాలి.. గులాబీ పార్టీ ఓటమి ఖాయమైపోయిందా ?
BRS vs Congress

BRS vs Congress(Telangana Politics):


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిపోయింది. ఎలాంటి ఎత్తుగడలు, వ్యూహాలు అమలు చేసినా అవి చిత్తవ్వడం గ్యారెంటీ అని క్లారిటీ వచ్చేసింది. ఇలాంటి సమయంలో తాను కూడా ఏం చేయలేనని ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ సైతం చేతులెత్తేశారనే టాక్‌ నడుస్తోంది. ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న గులాబీ బాస్‌ ఇటీవల పీకేతో సమావేశమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా గట్టెక్కించే మార్గాలు చూపించాలని కేసీఆర్ కోరగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఏం చేయలేనని పీకే క్లియర్‌గా చెప్పారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కుటుంబం, పాలనా వ్యవహారాల్లో తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది. ఎలాంటి ఎత్తుగడలు వేసినా ఉపయోగం లేదని కేసీఆర్‌కు పీకే వివరించారట. ఫ్లాష్ సర్వే నిర్వహించి ఆ రిపోర్ట్‌ను కేసీఆర్, కేటీఆర్‌కు అందించి ఓటమికి కారణాలు కూడా చెప్పారట. పీకే నివేదికతో ఏకీభవించిన కేసీఆర్‌ గౌరవప్రదమైన సీట్లు దక్కేలా సూచనలు ఇవ్వాలని పీకేను కోరినట్టు తెలిసింది. కర్ణాటక ఫలితాల తర్వాత క్రమంగా తెలంగాణలో హస్తం గాలి వీచి.. తుఫాన్‌గా మారిందని పీకే విశ్లేషించారట.

తెలంగాణలో ప్రస్తు ఉన్న పరిస్థితుల్లో ఎన్ని హామీలు ఇచ్చినా.. ఏం చేసినా ప్రజలు బీఆర్ఎస్‌ని నమ్మే పరిస్థితిలో లేరని పీకే వివరించారట. మూడు నెలలుగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ప్రజలు స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారని చెప్పారట. తొమ్మిదిన్నరేళ్ల పాలన చూసిన తర్వాత మార్పును కోరుకుంటున్నారని పీకే తెలిపారట. కాంగ్రెస్‌ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు ఫీడ్ బ్యాక్ వచ్చిందని వివరించరాట. ఎంత చెప్పినా కేసీఆర్‌ ఏదైనా వ్యూహాలు రచించాలని కోరగా.. కొన్నిచోట్ల పరిస్థితిలో మార్పు రావడానికి ప్రత్యామ్నాయాలను పీకే సూచించారట. గతేడాది పీకే సారథ్యంలోని ఐ-ప్యాక్‌ టీమ్‌తో బీఆర్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీపై అవగాహన కుదుర్చుకుంది. రాజకీయాల్లో కేసీఆర్ తనను మించిన వ్యూహకర్తలు లేరని భావించ మధ్యలోనే ముగించారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించడానికి ఐ-ప్యాక్ సేవలను వినియోగించుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా అడ్డం తిరగ్గా పీకే సహకారాన్ని కోరగా ఆయన తాను ఇప్పుడు ఏం చేయలేనని చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం హాట్‌ టాపిక్‌గా మారుతోంది.


ప్రజలతో కనెక్షన్‌ పోయిందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా అంగీకరిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్‌తో మాట్లాడిన ఆడియో సంభాషణng వైరల్‌ అయ్యాయి. సిరిసిల్లలో కూడా ఎదురుగాలి వీస్తుండటం గుర్తించి డ్యామేజ్‌ కంట్రోల్‌పై దృష్టిపెట్టారు. బీఆర్ఎస్ ఓడిపోనుందనే బలమైన మౌత్‌ టాక్‌ని తగ్గించేలా కేటీఆర్‌ సూచనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ గెలుస్తుందని చెబుతూ బీఆర్ఎస్‌ ఓటమిని ప్రమోట్‌ చేసుకుంటున్నామని క్లాస్‌ తీసుకుంటున్నారు. గతంలో తాను సిరిసిల్ల ప్రజలను కలవలేకపోయింది వాస్తవమేనని.. ఈసారి వారానికి రెండు రోజులు ఉంటానని కేటీఆర్ చెబుతున్నారు. ఆయన తండ్రి కేసీఆర్‌ కూడా గజ్వేల్‌లో డ్యామిట్‌ కథ అడ్డం తిరిగినట్లు అసంతృప్తి పెల్లుబకగా ఇదే విధంగా హామీ ఇచ్చారు. కొత్త రేషను కార్డులు, పింఛన్లు రానివాళ్లను చిరునవ్వుతో సమాధానం చెప్పి హామీ ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. కుల సంఘాల నాయకలు.. మాజీ ప్రజా ప్రతినిధులను కలుపుకపోవాలన్నారు. వాళ్ల అడిగే చిన్న కోరికలు తీర్చడం పెద్ద కష్టం కాదని.. హామీ ఇచ్చి తిప్పుకోవాలని సూచించారు. ఎవరైనా నిలదీసినా.. కోప్పడినా సంయమనం పాటించాలని చెబుతున్నారు. వలిగొండలో నిరుద్యోగులతో తన ప్రవర్తన తీవ్ర విమర్శల పాలవగా తనలా ప్రవర్తించవద్దని శ్రేణులకు సూచిస్తున్నారు.

ఓటమి భయం పట్టుకున్న బీఆర్ఎస్‌ నేతలు కొత్త ఎత్తుగడలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులు.. ప్రజలు ఓటు వేస్తారో.. లేదో.. అనే భయంతో ఏకంగా ప్రమాణాలు చేయిస్తున్నారు. ఓటు వేస్తేనే వచ్చేసారి సంక్షేమ పథకాలు అందజేస్తామని చెబుతున్నారు. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలతో మద్దతుగా తీర్మానాలు చేయిస్తున్నారు. దైవభక్తిని సెంటిమెంట్‌గా భావిస్తూ దేవుడి ఎదుట బీఆర్ఎస్‌ కేడర్‌ ప్రమాణాలు చేయిస్తోంది. అయితే ఇది కూడా జనంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తోంది. ఓటు తమకు ఇష్టం ఉంటే వేస్తాం.. లేకపోతే లేదు.. అంతేగానీ.. ప్రమాణాలు చేయించడం ఏంటని కొందరు గట్టిగా నిలదీస్తున్నారు. ఇక చేసేది లేక అలాంటి వాళ్లను బలవంతం ఏమీ లేదని వదిలేస్తున్నారట. కొంచెం మోహమాట పడేవారిని పిలిపించి ప్రమాణాలు చేయిస్తూ ఓట్లు రాబట్టేందుకు గులాబీ నేతలు కుయుక్తులు అమలు చేస్తున్నారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×