EPAPER
Kirrak Couples Episode 1

Telangana News : తెలంగాణలో పవర్ పాలిటిక్స్.. విద్యుత్ లెక్కలపై చర్చ..

Telangana News : తెలంగాణలో పవర్ పాలిటిక్స్.. విద్యుత్ లెక్కలపై చర్చ..
Telangana News


Telangana News : తెలంగాణలో అధికార విపక్షాల మధ్య పవర్ ఫైట్ కొనసాగుతోంది. ఉచిత విద్యుత్ పై అమెరికాలో రేవంత్ ఒకటి మాట్లాడితే మరొకటి వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ అయితే ఏకంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చింది. సీన్ కట్ చేస్తే విద్యుత్ విధానం చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. కరెంట్ లెక్కలపై చర్చకు సిద్ధమా అన్న కాంగ్రెస్ సవాళ్లకు అధికార పక్షం నుంచి రియాక్షన్ ఉండడం లేదు. అసలు రైతులకు ఉచిత కరెంట్ విషయంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో డిస్కంల పరిస్థితి ఎలా ఉంది?

తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా మారుతోంది తెలంగాణలో కరెంట్ లెక్కల పరిస్థితి. అవును అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యల చుట్టూ పవర్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో రేవంత్ మాట్లాడింది ఒకటైతే.. మరొకటి వైరల్ అవుతోంది. దీని వెనుక కుట్ర ఉందన్న వాదనను కాంగ్రెస్ వినిపిస్తోంది. రేవంత్ వీడియోలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు వ్యతిరేకం అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఈ ఇష్యూ మరో టర్న్ తీసుకున్నట్లయింది.


నిజానికి ఈ ఇష్యూ తెలంగాణలో కరెంట్ లెక్కలను మరోసారి తెరపైకి తెచ్చినట్లయింది. అసలు రాష్ట్రంలో ఎన్ని వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి.. ఎన్ని వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. వాటికి ఎంత కరెంట్ అవసరం అవుతోంది.. ఎంత ఇస్తున్నారు… ఎంతకు కరెంట్ కొంటున్నారు… నష్టాల సంగతేంటి… డిస్కంల భవిష్యత్ ఏంటి… ఇలాంటి విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే 2014 నాటికి డిస్కంలకు సర్కార్ బకాయిలు 1200 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు అది కొండలా పెరిగిపోయింది. 40 వేల కోట్లకు పైనే బాకీలు ఉన్నాయన్న అంచనాలున్నాయి.

డిస్కంల పరిస్థితి ఎలా తయారైందంటే.. రాష్ట్రంలో అవసరాలు తగినంత కరెంట్ ఉత్పత్తి లేకపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టి అదీ ఎక్కువ ధర చెల్లించి కరెంట్ కొనాల్సి వస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంటున్నాయి. చివరికి ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. విద్యుత్ శాఖలో అసలేం జరుగుతోందన్న ప్రశ్నలను ఆర్టీఐ కింద పెట్టినా వాటికి జవాబు ఇవ్వకుండా తిరస్కరించే పరిస్థితి ఉందంటున్నాయి విపక్షాలు. డిస్కంల లెక్కలు ఇప్పటికీ బయటపెట్టకపోవడానికి కారణాలేంటి? దీనిపై ప్రభుత్వం చర్చకు వస్తుందా అని కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు.

విద్యుత్ పంపిణీ సంస్థలు టెక్నికల్ గా ARR రిపోర్ట్ లో ఒక్క ఏడాదికి సంబంధించి ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో చూపిస్తున్నాయి. పాత బాకీలు, ఓవరాల్ గా ఎంత ఉన్నాయన్న విషయాన్ని చూపడం లేదు. డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే అవి నష్టాల్లో ఉండవంటున్నారు. అసలు తెలంగాణలో కరెంట్ లెక్కల్లో చాలా గోల్ మాల్ నడుస్తోందన్న ఆరోపణలను విపక్షాలు వినిపిస్తూ వస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వాడుతున్న కరెంట్ లెక్కలు తేల్చేందుకు డిస్కంలు ముందుకురావడం లేదంటున్నారు. ప్రస్తుతం రైతులకు ఉచిత కరెంట్ కోసం ఏటా 12 వేల కోట్ల రూపాయలను సర్కార్ అగ్రికల్చర్ సబ్సిడీ కింద చెల్లిస్తోంది.

రాష్ట్రంలో రిలీజ్ విద్యుత్ అవసరాలు, ఆదాయ, వ్యయ అంచనాల వివరాలను ఈ మార్చ్ లో ఈఆర్సీ వెల్లడించింది. ఆ ప్రకారం 2023-24లో డిస్కంలకు కరెంట్ బిల్లుల ద్వారా 43 వేల 221 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఓవైపు ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. డిస్కంలకు నష్టాలు, అప్పులు మాత్రం ఎలా వస్తున్నాయన్న ప్రశ్నలున్నాయి. అందుకే సమగ్ర విద్యుత్ విధానంపై చర్చకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు 6 లక్షలు ఉన్నాయి. వీటి కింద 26 లక్షల పంపు సెట్లు ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఉచిత విద్యుత్ కోసం 12 వేల కోట్లను సర్కార్ ఏ లెక్కన ఇస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 6 లక్షల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లకు ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో ఎవరూ లెక్క చెప్పని పరిస్థితి. రాష్ట్రంలో వ్యవసాయ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే సాగుకు ఎంత కరెంట్ ఇస్తున్నారనే లెక్కలు తెలుస్తాయి. అందుకే ఈ లెక్కలు తెలుసుకునేందుకు ప్రతి అగ్రి ట్రాన్స్ ఫార్మర్ దగ్గర స్మార్ట్ మీటర్ పెట్టాల్సిందేనని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలకు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే మోదీ సర్కార్ మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తోందంటూ కేసీఆర్ సర్కార్ ఫైర్ అవుతోంది. రైతుల ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్ల దగ్గర మీటర్ పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సర్కార్ చెబుతోంది.

రాష్ట్రంలో నార్త్ , సౌత్‌‌‌‌ డిస్కంలు రెండు ఉన్నాయి. ఇప్పటివరకు వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ పై ఈ సంస్థలు అంచనాల లెక్కలే చెబుతున్నాయి. వీటి ఆధారంగానే మొత్తం కరెంటులో అంటే అగ్రి కల్చర్ నాన్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్లో వ్యవసాయానికి సగటున 36 శాతం వ్యవసాయానికి ఇస్తున్నట్లు లెక్కగట్టి ఆ మేరకు సబ్సిడీలు పొందుతున్నాయి. ఆదాయం, మిగులు లెక్కలపై అంతా గోల్ మాల్ గోవిందం మాదిరిగా ఉన్నాయన్న విమర్శలున్నాయి. వ్యవసాయానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుందో కచ్చితమైన లెక్కలు చెబితే.. కచ్చితమైన ఎమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో అలా జరగడం లేదు.

కమీషన్లకు కక్కుర్తి పడే కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ స్లోగన్ ఎత్తుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇందులో బయటకు తెలియని లెక్కలు చాలా ఉన్నాయంటున్నారు. ఇక ఈ లెక్కలు ఇలా ఉంటే.. తెలంగాణలో అసలు 24 గంటల పాటు నాన్ స్టాప్ కరెంట్ సప్లై ఉండడం లేదు. డిస్కంలు ఎక్కువ రేటుకు బయటి నుంచి కరెంట్ కొనలేని పరిస్థితి ఉంటే ఒకలా.. కొనే పరిస్థితి ఉంటే మరోలా సిచ్యువేషన్ ఉంటోంది. ఇందుకు ఉదాహరణ గత యాసంగి సీజన్. రైతులు వరి నార్లు వేసుకుని నీళ్లు పెట్టుకునే సమయంలో అప్రకటిత కరెంట్ కోతలు విధించారు. దీంతో త్రీఫేజ్ కరెంట్ లేక రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకోలు చేశారు, సబ్ స్టేషన్లు ముట్టడించారు. ఇవన్నీ కళ్లముందు కనిపించిన ఉదాహరణలే.

ఇప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి ఎలా మారిందంటే.. 24 గంటలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వకపోయినా తమ పంటలకు అవసరం ఉన్న సమయంలో నాణ్యమైన కరెంట్ ఇస్తే చాలు అనుకునే వరకు పరిస్థితి వచ్చింది. పంజాబ్, హర్యానాలో కూడా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా… కరెంట్, నీళ్లు వృధా అవ్వొద్దు, గ్రౌండ్ వాటర్ ను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ వరల్డ్ బ్యాంక్ సూచనలతో ప్రత్యేక మెకానిజం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర విద్యుత్ రంగం మాత్రం సంక్షోభంలో కూరుకుపోయిందన్న వాదన పెరుగుతోంది. సమస్యలు ఇలా ఉంటే… కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమని బీఆర్ఎస్ ఎదురుదాడి చేయడం ఏంటన్న ప్రశ్నలను విపక్ష నేతలు వినిపిస్తున్నారు.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

Big Stories

×