EPAPER

Telangana Paddy Seeds Issue: విత్తన రాజకీయం వాస్తవం ఏంటి!?

Telangana Paddy Seeds Issue: విత్తన రాజకీయం వాస్తవం ఏంటి!?

తొలకరి పడకముందే తెలంగాణలో విత్తనాల అలజడి మొదలైంది. సాగు సమయానికి కాస్త టైమ్ అటు ఇటు అయినా విత్తనాలను సేకరించి పెట్టుకుంటే బెటర్ కదా అనే ఆలోచన రైతుల్లో మొదలైంది. సో.. ఆటోమెటిక్‌గా విత్తనాల కొనుగోళ్లు పెరిగాయి. అందరికి ఒకేసారి కావాలి అనుకునే సరికి డిమాండ్‌ కూడా పెరిగిపోయింది. అది కాస్త కొరతకు దారి తీసింది. ఆ కొరతే అన్నదాతలో ఆవేశాన్ని నిద్రలేపింది. ఆ ఆవేశమే ఆందోళనలకు కారణమవుతోంది. తెలంగాణలో విత్తనాల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి ఇది నిజం.

కానీ నిజంగా విత్తనాలు అందుబాటులో లేవా? అంటే ఉన్నాయనే చెప్పాలి. బట్.. రైతులకు కావాల్సింది కొన్ని రకాల బ్రాండ్ల విత్తనాలు. తమకు ఆ విత్తనాలు మాత్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ వచ్చింది అసలు చిక్కు. ఆ విత్తనాల కోసమే చిన్నపాటి యుద్ధాలు చేస్తున్నారు. గతేడాది ఓ కంపెనీ విత్తనాలు సాగు చేసిన రైతులకు దిగుబడి వచ్చిందన్న ప్రచారం మొదలైంది. దీంతో తమకు కూడా ఆ కంపెనీ విత్తనాలే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఆ కంపెనీ విత్తనాలు డీలర్ల వద్ద లేవు.. కొంత మేరకే ఉన్నాయి. దీంతో కొందరికి అమ్మితే పద్ధతి కాదని.. అందరికి అందేలా కొన్ని కొన్ని ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు డీలర్లు.


ఇది ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ప్రసెంట్ సిట్యూవేషన్.. అయితే అంతా సరిగ్గా చేస్తే వాళ్లు వ్యాపారులు ఎందుకు అవుతారు. కొందరు వ్యాపారులు రైతుల డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.. ఒక్కో ప్యాకేట్‌ ధరను ఆమాంతం పెంచేస్తున్నారు. బట్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా.. ఇప్పటికే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అటు వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారి విత్తనాల లభ్యతపై రివ్యూలు నిర్వహించారు. రైతులకు అందుబాటులో విత్తనాలను ఉంచాలని ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. అంతేకాదు.. నకిలీ విత్తనాలను అమ్మితే తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది ప్రభుత్వం.

Also Read: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పూర్తి వివరాలు.. ఇవే

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు అధికారులు. చాలా జిల్లాల్లో నాసి రకం విత్తనాలు బయటపడుతున్నాయి. గోడౌన్స్‌లో ముమ్మరంగ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో.. కావాలనే కృత్రిమ కొరత సృష్టించినా.. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టినా తీవ్రమైన చర్యలు తప్పవు. ఇది యాక్చువల్ సిట్యూవేషన్.. ఇప్పుడు విత్తనాలపై జరుగుతున్న రాజకీయాలపై ఫోకస్ చేద్దాం. విపక్షాలకు విత్తనాల అంశం రాజకీయాస్త్రంగా మారింది.

అఫ్‌కోర్స్ నేతల మనుగడకు ఏదో ఒక అంశం ఉండాలి.. తప్పులేదు. కానీ దాని కోసం రైతన్నలను పావుగా వాడుకోవడం సరికాదు. ఎందుకంటే ఆరుగాలం చేమటోడ్చి.. దుక్కి దున్ని పంటను సాగు చేస్తారు. ఇప్పుడు నేతలు చేసే కన్ఫ్యూజన్ కారణంగా విత్తనాల కోసం రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. అంటే కొరత లేనే లేదా? అంటే లేదని కాదు.. ఉంది అనే చెప్పాలి.. రైతులంతా ఒకే బ్రాండ్ విత్తనాలు కావాలని ఎక్స్‌పెక్ట్‌చేయడం సమస్యకు కారణమైంది. బట్ మెల్లిమెల్లిగా సమస్యలన్ని తీరుతాయి. ఇది ప్రభుత్వం ఇస్తున్న హామీ.. సో కాస్త సంయమనం పాటిస్తే పరిస్థితులన్ని మెరుగుపడతాయి.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×