EPAPER

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్‌రావు తప్పక హాజరుకావాల్సిందే!

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్‌రావు తప్పక హాజరుకావాల్సిందే!

Phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? నాంపల్లి కోర్టు ఎందుకు కీలక నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది? వర్చువల్‌గా హాజరవుతామని చెప్పినా నేరుగా ఎందుకు రమ్మంది? మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్‌రావుకు కష్టాలు తప్పవా? న్యాయస్థానం ఆదేశాలతో కొందరు నేతలు ఎందుకు వణుకుతున్నారు? ఆయా ప్రశ్నలపై రాజకీయ పార్టీల నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు


తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఏ 6 నిందితుడు శ్రవణ్‌రావును న్యాయస్థానంలో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ వర్చువల్‌గా న్యాయస్థానం ముందు హాజరవుతారని దర్యాప్తు బృందం తెలిపింది. అందుకు ససేమిరా అంది.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రధాని నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను నేరుగా హాజరు పరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు అమెరికా వెళ్లనుంది దర్యాప్తు బృందం. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను ఇండియాకు రప్పించేందు కు తెలంగాణ పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్‌రావు ఉండే ప్రాంతాన్ని సిట్ గుర్తించినట్టు అంతర్గత సమాచారం. మరో నిందితుడు శ్రవణ్‌రావు ఆచూకీని సిట్ టీమ్ గుర్తించలేదు.


ALSO READ:  కేసీఆర్.. బిడ్డా లెక్కలు సరిపోయాయి.. నిధులకు డోకా లేదు

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారమంతా ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చుట్టూ తిరుగుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ టీమ్ ఓ అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధా‌కిషన్‌రావు రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా పలుమార్లు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×