EPAPER

Farm Loan Waiver: డోంట్ వర్రీ.. అందరికీ మాఫీ చేస్తాం.. కటాఫ్ డేట్ పెడ్తాం: మంత్రి పొంగులేటి

Farm Loan Waiver: డోంట్ వర్రీ.. అందరికీ మాఫీ చేస్తాం.. కటాఫ్ డేట్ పెడ్తాం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇలా ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణను కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారని, కానీ, ఖజానా అంతా ఖాళీగా ఉన్నదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అప్పు చూసి షాక్ అయ్యామని తెలిపారు. తాము అధికారం చేపట్టగానే దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజు చేసే పనిలో మునిగిపోయామని వివరించారు.


కొన్ని టెక్నికల్ కారణాలతో కొందరి రైతుల ఖాతాలో మాఫీ నిధులు జమ కాని మాట వాస్తవం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే.. మరికొందరు రైతులు 2 లక్షలకు మీద ఉన్న డబ్బులను కట్టకపోవడం వల్ల మాఫీ డబ్బులు జమ కాలేదని వివరించారు. మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి.. మేం తూచ్ అనడం లేదని స్పష్టం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులై రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఒక కటాఫ్ డేట్ పెడుతుందని, అంతలోపు రైతులు ఆ రెండు లక్షలకు మీద ఉన్న డబ్బులు కట్టాలని, వారందరికీ మాఫీ చేస్తామని వివరించారు. తాము అనుకున్న ప్రకారమే.. రూ. 31 వేల కోట్లలోనే అంకెలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంకా ఒక వెయ్యో.. మరో 1500 కోట్లో పెరిగే అవకాశం ఉన్నా తాము అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వారు వదిలిపెట్టేది ఏమిటని ఎదురు ప్రశ్నించారు మంత్రి పొంగులేటి. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 16 నుంచి 17 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు కూడా కాలేదని, కానీ, రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తున్నదని వివరించారు.


అనేక గిమ్మిక్కులు చేసి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడని, కానీ, ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. వారి హయాంలో మొత్తంగా సుమారు లక్షాల 30వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని, అందులో ఇంకా సుమారు 33 వేల ఇళ్లు పూర్తి కాలేదని తెలిపారు. చాలా ఇళ్లలకు మౌలిక వసతులు లేవని వివరించారు. ఈ కారణంగా వాటిని లబ్దిదారులకు అందించలేదని పేర్కొన్నారు.

Also Read: Deputy CM : సినిమాలు సినిమాలే.. రాజకీయాలు రాజకీయాలే.. అలాంటి వ్యక్తిని కాను : పవన్ కల్యాణ్

గత ప్రభుత్వం ఖర్చు పెట్టి అసంపూర్తిగా మిగిలిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఇటుక మీద.. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకు ఇటుక పెట్టాలనే భేషజాలకు పోవడం లేదని, అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేయడానికి తాము సిద్ధమని, వాటిని పేదవాళ్లలో బహు పేదలకు అందించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటి అనేక అసంపూర్తి ఇళ్లు ఉన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి అందిస్తామని వివరించారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా తమకు ఇళ్లు లేదని చెప్పే పరిస్థితి లేకుండా చూసుకుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే నిర్ణయానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతగా నాలుగు లక్షల 50 వేల ఇళ్లు నిర్మించాలని, అంటే నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లు తగ్గకుండా నిర్మిస్తామని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించిన భేషజాలకు పోకుండా స్వీకరిస్తామని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు కౌంటర్:

కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. బఫర్ జోన్‌లో తనకు ఇల్లు లేదని స్పష్టం చేశారు. ఒక వేళ తనకు బఫర్ జోన్‌లో ఇల్లు ఉంటే కూల్చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికే బఫర్ జోన్‌లో నివాసాలు ఉన్నాయన్నారు. జన్వాడ్ ఫామ్ హౌజ్ ఇప్పుడు తనది కాదని కేటీఆర్ అంటున్నారని పేర్కొన్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×