EPAPER

Telangana Lok Sabha Elections Results 2024: తెలంగాణ కింగ్ ఎవరు? ఎన్నికల తర్వాత పార్టీల భవిష్యత్తేంటి?

Telangana Lok Sabha Elections Results 2024: తెలంగాణ కింగ్ ఎవరు? ఎన్నికల తర్వాత పార్టీల భవిష్యత్తేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలు. బీఆర్ఎస్‌కు ఆత్మగౌరవ పరీక్ష.. జీవన్మరణ సమస్య.. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనీసం సీట్లను గెలవకపోతే.. ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంలో పడే చాన్స్‌ ఉంది. కానీ ఇదే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఏ ఒక్క సర్వే కూడా బీఆర్ఎస్‌కు ఒకటి కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని చెబుతోంది. కొన్ని సర్వేలు అయితే అసలు బీఆర్ఎస్‌ సీట్ల సంఖ్యను సున్నాగా చూపిస్తున్నాయి. అంటే బీఆర్ఎస్‌ ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయిందని తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడటం ఖాయమైనట్టే..

ఇక కాంగ్రెస్‌ పరిస్థితి మరో రకంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే వచ్చిన ఎన్నికలు కాబట్టి.. తమ పాలనపై ఓ రిపోర్ట్‌ కార్డ్‌గా ఈ ఎన్నికలను భావిస్తుంది కాంగ్రెస్.. అయితే ఇక్కడొక మెయిన్ ఉంది. అదేంటంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖచ్చితంగా బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించాలి. అది గనుక జరగకపోతే కాంగ్రెస్ పాలనపై నెగెటివ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది. నిజానికి 14 ఎంపీ సీట్ల టార్గెట్‌తో ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్.. కానీ ఇప్పుడు ఎగ్జిట్‌ పోల్ రిపోర్ట్స్‌ చూస్తే.. ఆ నెంబర్‌ ఎనిమిది, తొమ్మిది మధ్యే తచ్చాడుతోంది. సో.. కాంగ్రెస్‌ నేతల్లో కాస్త టెన్షన్‌ మొదలైంది.


Also Read: తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..

ఇక బీజేపీ పరిస్థితి కంప్లీట్‌ రీవర్స్‌లో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ గెలిచిన సీట్లు.. నాలుగు.. కానీ ఇప్పుడా నెంబర్ డబుల్‌ కావడం ఖాయమని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్.. అంటే.. తెలంగాణలో బీజేపీ పుంజుకుందని తెలుస్తోంది. ఇది ఆ పార్టీకి నిజంగా శుభసూచకమే.. నిజమైతేనే అనుకోండి.. ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చినప్పటి నుంచి బీజేపీ శ్రేణుల్లో ఓ కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఎన్నికల ముందు సిట్టింగ్ స్థానాలతో పాటు.. ఒక్క స్థానం ఎక్కువ గెలిచినా తమకు బోనసే అనే థాట్‌లో ఉండేవారు బీజేపీ నేతలు.. బట్ ఇప్పుడా కౌంట్ ఏకంగా డబుల్ అని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్.. అయితే కాంగ్రెస్‌ కంటే ముందు ఉంటామా? లేదా? అనే టెన్షన్‌ ఆ నేతల్లో అయితే కనిపిస్తోంది.

సో ఓవరాల్‌గా చూస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ సైడ్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఎట్ ది సేమ్‌ టైమ్.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హైఓల్టేజ్ వార్ నడిచినట్టు తేలింది. ఎగ్జిట్ పోల్స్‌ బీజేపీలో జోష్‌ నింపాయి. బీఆర్‌ఎస్‌లో కన్నీళ్లు తెప్పించాయి. కాంగ్రెస్‌లో టెన్షన్‌ను పెంచాయి ఇవన్నీ చూస్తున్న ప్రజల్లో కూడా క్యూరియాసిటీ ఆమాంతం పెరిగింది. బట్ ఎగ్జాక్ట్ నంబర్‌ తేలాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×