EPAPER

TS Inter Exams 2024 : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

TS Inter Exams 2024 : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..
ts inter hall ticket 2024

TS Inter Halltickets Download(Telangana today news): తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఆయా కాలేజీలకు విద్యార్థుల హాల్ టికెట్లు జారీ అయ్యాయి. ఆన్లైన్ లోనూ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్ ESSSC నంబర్ తో హాట్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే సెకండియర్ వారు మొదటి ఏడాది హాల్ టికెట్ నంబర్ తోనే హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.


ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ కు వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లలో ఏవైనా తప్పులుంటే.. యాజమాన్యాన్ని సంప్రదించాలని సూచించారు. కాగా.. పరీక్షలకు మరో ఐదురోజులే సమయం ఉంది. ఇంతవరకూ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను ఉంచలేదు. త్వరలోనే హాల్ టికెట్లను అప్డేట్ చేస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.

Read More :  మిషన్ భగీరథపై సీఎం రేవంత్ ఫోకస్.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష


ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు..

ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
మార్చి 1న ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 4న మ్యాథ్స్ -1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ -1 మార్చి 6న మ్యాథ్స్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మార్చి 11న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
మార్చి 15న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మార్చి 18న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జాగ్రఫీ పేపర్ -1 పరీక్షలు జరగనున్నాయి.

అలాగే ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు..

ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మార్చి 2న ఇంగ్లీష్ పేపర్-2
మార్చి 5 మ్యాథ్స్ -2, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ -2 మార్చి 7న మ్యాథ్స్ 2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
మార్చి 16న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2 పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×