EPAPER

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు… అధికారులకు క్లాస్, ఏం చెప్పిందంటే ?

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు… అధికారులకు క్లాస్, ఏం చెప్పిందంటే ?

Telangana High Court : అనుకున్నదే అయ్యింది. తెలంగాణలోనే పనిచేస్తామంటూ పట్టుబట్టిన ఆ నలుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు ఊహించని సూచనలు అందజేసింది. వెంటనే కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్లు క్యాట్ ఆదేశాలపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, వాణీప్రసాద్ల లంచ్మోషన్ పిటిషన్‌ను అనుమతించిన కోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభించింది.

సొంత రాష్ట్రాల్లోనే రిపోర్ట్ చేయాలి…


దాదాపు 2 గంటల విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా సదరు అధికారులు తమకు కేంద్రం (డిఓపీటీ) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆదేశాల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రిపోర్ట్ చేయాలని సూచనలు ఇచ్చింది.

కోర్టుకు రావడం సరికాదు…

మీ అభ్యర్థనపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ అనుకూలమైన తీర్పు ఇవ్వకపోతే కోర్టుకు రావటం సరికాదని తెలిపింది. ఒకవేళ మీ పిటీషన్ డిస్మిస్ చేస్తే మళ్లీ కోర్టుకే వస్తారని, పని చేసేందుకు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లి పని చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీటిపై విచారణ తర్వాత చేస్తామని తెగేసి చెప్పేసింది. ఫలితంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులపై డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా అలాటెడ్ రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది.

హైకోర్టును ఎవరు ఆశ్రయించారంటే…

రొనాల్డ్‌రోస్‌, శివశంకర్‌, హరికిరణ్‌, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌ డీఓపీటీ ఉత్తర్వులపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నేడే ఆఖరి తేదీ…

తాము ఉన్న క్యాడర్ లోనే పనిచేస్తామని, బదిలీలు లేకుండా కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. విచారించిన క్యాట్, డీఓపీటీ ఉత్తర్వులను నిలిపేసేందుకు నిరాకరించింది. దీంతో బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసి అత్యవసరంగా విచారించాలని కోరారు. ఫలితంగా తీర్పును రిజర్వు చేస్తూ న్యాయస్థానం ప్రత్యేక సూచనలు ఇచ్చింది. మరోవైపు కేటాయించిన రాష్ట్రాల్లో చేరేందుకు డీఓపీటీ గడువు నేటితో తీరనుంది.

జస్టిస్ అభినంద్ కుమర్ శావిలి బెంచ్ పిటీషన్లను విచారించింది. కేంద్రం తరఫున న్యాయవాది వాదిస్తూ ఏ అధికారి ఎక్కడ పని చేయాలో చెప్పే అధికారం కోర్టుకు లేదన్నారు. సివిల్ సర్వీస్ అధికారులు పూర్తిగా కేంద్రం అధీనంలో పనిచేస్తారని, ఈ మేరకు కేంద్రంలోని సీనియర్ అధికారులే వీరి పోస్టింగ్లులపై నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు…

విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు ప్రజా సేవ కోసమే ఉన్నారని, ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడే పనిచేయాలని సూచించింది.

also read : మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

Related News

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

CM Chandrababu: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

CM Chandrababu : ఎల్లుండి టీడీఎల్పీ భేటీ, క్యాడర్ బలోపేతంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. క్లీన్ ఎనర్జీ పాలసీకి ఆమోదం..

Tirupati: శవంతో సాహస యాత్ర! ప్రాణాలకు తెగించినా పట్టించుకోని అధికార యంత్రాంగం

Big Stories

×