EPAPER

Telangana Paddy Issue: తెలంగాణలో ధాన్యం దంగల్..!

Telangana Paddy Issue: తెలంగాణలో ధాన్యం దంగల్..!

Telangana paddy news(Political news in telangana): తెలంగాణలో మళ్లీ ధాన్యం దంగల్ మొదలైంది. అయితే ఈసారి మరో రకంగా ఇది కొనసాగుతోంది. ఇంతకీ ఈ దంగల్‌కు రీజనేంటి? అధికార పక్షం ఏం చెబుతోంది? విపక్షం ఏమంటోంది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత చేసిన స్టేట్‌మెంట్ ఇది. తడిసిన ధాన్యమైనా కొంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. అయితే సన్న వడ్లు పండించిన వారికి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రకటించారు పొంగులేటి. ఇక అప్పుడు మొదలైంది అసలైన పంచాయితీ.. ఈ స్టేట్‌మెంట్ అలా వచ్చిందో లేదో.. బీఆర్ఎస్‌ వెంటనే అలర్టైంది. మీరు ఇచ్చిన హామీ ఏంటి? అమలు చేస్తున్నదేంటి? అంటూ విమర్శలు మొదలు పెట్టారు బీఆర్ఎస్‌ నేతలు.


మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నలివి.. ఇది మోసం.. అన్యాయం.. కాంగ్రెస్ సర్కార్ రైతులకు కుచ్చుటోపి పెడుతోంది. ఇలా సాగిపోయింది ఆయన విమర్శల వర్షం.. మరి నిజంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామందా? ఇక భవిష్యత్తులో దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వనని చెప్పిందా? మరి దీనికి రేవంత్ సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇదీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన క్లారిటీ.. దొడ్డు వడ్లకు మేం ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు. ఈ సీజన్‌లో సన్న వడ్లకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు..

అయితే దీని వెనక కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా దొడ్డు వడ్లు ఎన్ని పండుతున్నాయి.. సన్న వడ్లు ఎన్ని పండుతున్నాయి. ప్రస్తుతం మన స్టేట్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా దొడ్డు బియ్యం నిల్వలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. దీంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇయర్‌ వైస్ డేటాను పరిశీలిస్తే..


Also Read: వారణాసీలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం.. ఎవరి తరఫుననో తెలుసా..?

2020–21లో 125.51 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం పండింది.
93.01 లక్షల దొడ్డు ధాన్యం పండింది.
2021–22లో 105.90 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవి.
96.26 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబటి అయ్యింది.
2022–23లో 178.46 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి కాగా..
కేవలం 79.74 లక్షల సన్న ధాన్యం మాత్రమే దిగుబడి అయ్యింది.
2023–24లో 174.18 లక్షల దొడ్డు ధాన్యం.. 86.26 లక్షల సన్న ధాన్యం దిగుబడి అయ్యింది.
సో లాస్ట్ టూ ఇయర్స్ చూస్తే రాష్ట్రంలో దొడ్డు బియ్యం సాగు భారీగా పెరిగిపోయింది.
అదే సమయంలో సన్న ధాన్యం సాగు గణనీయంగా పడిపోయింది.

సో.. దొడ్డు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. సన్న రకాల కొరత ఏర్పడుతంది. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది.రేషన్‌ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తోంది. సన్న బియ్యం కోటా మన రాష్ట్ర పంపిణీ అవసరాలకు అసలు ఏమాత్రం సరిపోవడం లేదు. రేషన్ షాపుల ద్వారా ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరం.. అంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానం. కానీ అది సరిపోవడం లేదు ఇప్పుడు.

అందుకే సన్నాల సాగు పెరిగితే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా.. ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.. మారిన అవసరాలకు అనుగుణంగా రైతులు దొడ్డు రకాలకు బదులు.. సన్నరకాల వరి సాగుపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడే చాన్స్ ఉంది. అయితే దొడ్డు రకంతో పోలిస్తే సన్నబియ్యం దిగుబడి కొంత తగ్గుతుంది. అందుకే రైతులు దొడ్డు రకం ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వటం ద్వారా రైతులకు వచ్చే దిగుబడి నష్టాన్ని పూడ్చే వీలుంది.

నిజానికి ఎకరానికి దొడ్డు రకమైతే 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. సన్న రకాలు మాత్రం 21 క్వింటాళ్లే వస్తుంది. అంటే సన్నాలు సాగు చేసే వారికి 4 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది. సో నష్టపోతామని ఆలోచించే వారికి ప్రభుత్వం ఇచ్చే బోనస్‌తో బెనిఫిట్ జరగనుంది. ఇవీ లెక్కలు.. అయితే సన్న బియ్యంతో పాటు త్వరలోనే అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం కూడా రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×