EPAPER
Kirrak Couples Episode 1

Telangana: గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్.. తెలంగాణలో కలకలం..

Telangana: గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్.. తెలంగాణలో కలకలం..

Telangana: గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్. చాలాకాలంగా సాగుతోంది కోల్డ్‌వార్. గవర్నర్‌ను ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదని రాజ్‌భవన్ ఆరోపణ. ప్రభుత్వానికి గవర్నర్ ఇబ్బందులు సృష్టిస్తున్నారనేది సర్కార్ వాదన. ఈ గొడవ కాస్తా ముదిరి.. నానారచ్చకు దారి తీసింది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సెషన్ నడిపించడం.. రాజ్‌భవన్ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడం.. ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా మౌనం పాటించడం.. ఇలా వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. అయితే, ఇటీవల సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం చేర్చింది. ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ తమిళిసై ప్రసంగం కొనసాగింది. ఈ పరిణామం చూసి.. ఇక ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ అనుకున్నారంతా. కానీ.. అవి అలానే కంటిన్యూ కావడంతో అగ్గి మరింత రాజుకుంది.


అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంతో చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేసీఆర్ సర్కార్. సుప్రీంలో రిట్ పిటిషన్ వేశారు సీఎస్. గవర్నర్ సెక్రెటరీ, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శులను ప్రతివాదిగా పేర్కొంటూ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పెండింగ్ బిల్లులపై డౌట్లు క్లారిఫై చేయడానికి ఇది వరకు మంత్రులు, అధికారులు పలుమార్లు రాజ్ భవన్ వెళ్లారు. వివరించారు. అయినా వాటికి మోక్షం కలగకపోవడంతో చివరగా కోర్టులోనే తేల్చుకునేందుకు డిసైడై.. ఇప్పుడు సుప్రీం మెట్లెక్కారు. గవర్నర్‌ తమిళిసై దగ్గర 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌ లో ప్రస్తావించింది రాష్ట్ర సర్కార్. ఈ 10 బిల్లులకు 2022 సెప్టెంబర్‌లో అసెంబ్లీ, మండలి ఆమోదం తెలపగా.. వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపారని, ఇప్పటికీ వాటిని పెండింగ్ లోనే పెట్టారని అంటున్నారు.

గవర్నర్ పెండింగ్ లో పెట్టిన వాటిలో ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, మున్సిపల్‌ చట్ట సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, యూనివర్సిటీ ఆఫ్‌ ఫారెస్ట్రీ తెలంగాణ , ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ బిల్లు, పంచాయతీరాజ్‌ బిల్లు, మున్సిపాలిటీల బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లుల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టసవరణ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. కొన్ని బిల్లులపై గతంలో గవర్నర్ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ వర్శిటీలతో వ్యాపారమా అని ప్రశ్నించారు. బిల్లుల ఆమోదానికి ఫలానా గడువేమీ లేదని కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇక ఉమ్మడి రిక్రూట్ మెంట్ బిల్లు ఎక్కడా సక్సెస్ కాలేదన్న వాదన ఉండడంతో దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ UGCకి గవర్నర్ లేఖ కూడా రాశారు. బిల్లులు ఏవీ పెండింగ్ లో పెట్టలేదని, కేవలం పరిశీలనలోనే ఉన్నాయన్న వాదనను రాజ్ భవన్ వినిపిస్తూ వస్తోంది.


ఒకటి రెండింటిపై డౌట్లు ఉంటే పెండింగ్ లో పెట్టినా ఓ అర్థముందని, కానీ అన్నిటికీ పక్కన పెట్టేడయం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గవర్నర్ పొలిటీషియన్ లా వ్యవహరిస్తున్నారని, బ్రిటిష్ వాళ్లు తెచ్చిన వ్యవస్థ మనకు అవసరమా అని మంత్రులు పలు సందర్భాల్లో ప్రశ్నలు సంధించారు. బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో ఇటీవలే ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి గవర్నర్ పై వివాదాస్పద కామెంట్స్ చేయడం, చివరకు జాతీయ మహిళా కమిషన్ ముందు విచారణకు కూడా హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అసెంబ్లీ సెషన్ లో గవర్నర్ ప్రసంగం లేకుండానే కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లింది. అయితే ఈసారి బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. బడ్జెట్ కు ఆమోదం తెలిపేలా సూచనలు చేయాలంటూ హైకోర్టు తలుపు తట్టింది సర్కారు. అయితే హైకోర్టు అప్పుడు ఈ ఇష్యూను జాగ్రత్తగా రాజీ చేయించింది. తాను కొందరికి నచ్చకపోవచ్చు. అయినా సరే తెలంగాణ ప్రజల కోసం పని చేస్తూనే ఉంటా అని గవర్నర్ అన్న సందర్భాలున్నాయి. కొత్త భవనాలు కట్టడం డెవలప్ మెంట్ కాదు.. నేషన్ బిల్డింగ్ అభివృద్ధి అని రిపబ్లిక్ డే రోజున గవర్నర్ కామెంట్స్ చేశారు. ఫాంహౌజ్ లు కట్టడం కాదు.. అందరికీ ఫాంలు ఉండాలన్నారు గవర్నర్.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అక్కడి గవర్నమెంట్స్ కు, గవర్నర్ కు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. అటు తెలంగాణ గవర్నర్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఢీ అంటే ఢీ అంటున్నారు. తెలంగాణతో తనకు మూడేళ్ల బంధం కాదని, పుట్టుక నుంచి ఉన్న బంధం అని చెప్పడం ద్వారా ఈ ఇష్యూలో తాను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో సర్కార్ కు సిగ్నల్స్ ఇస్తున్నారు. మరి రాజ్యాంగ వ్యవస్థల సంఘర్షణను సుప్రీం కోర్టు ఎలా డీల్ చేస్తుందన్న ఉత్కంఠ ఉంది.

బిల్లులు ఆమోదింపజేయాలని కోరుతూ.. గవర్నర్‌పై ఓ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం మామూలు విషయం కానే కాదు. అందుకే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందీ పిటిషన్.

Related News

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Big Stories

×