EPAPER

Govt Hostels: ఆపరేషన్ హాస్టల్స్.. డిప్యూటీ సీఎం సందర్శన.. మంత్రుల రివ్యూ.. ఏసీబీ తనిఖీలు

Govt Hostels: ఆపరేషన్ హాస్టల్స్.. డిప్యూటీ సీఎం సందర్శన.. మంత్రుల రివ్యూ.. ఏసీబీ తనిఖీలు

Deputy CM Bhatti Vikramarka: తెలంగాణపై డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన పది రోజుల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ ఎఫెక్ట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్ల కొరత కూడా ఏర్పడుతోంది. ఇదే క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల పంట పండుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,847 డెంగ్యూ కేసులు నమోదు కాగా, అత్యధికంగా హైదరాబాద్‌లో 1101 కేసులు ఉన్నాయి. ఖమ్మం 287, మేడ్చల్‌ 268, సూర్యాపేటలో 217 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అలాగే, 6,500 టైఫాయిడ్‌, 140 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. వర్షాల నేపథ్యంలో దోమలు పెరగడంతో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత పది రోజుల్లో పాము కాటుతో ఒకరు, అనారోగ్యంతో మరికొరు మృతి చెందారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. ఆపరేషన్ హాస్టల్స్ చేపట్టింది.


డిప్యూటీ సీఎం భరోసా

మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఉన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థులు గణాదిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురి అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిని విచారించారు. ప్రతినెల విద్యార్థుల ఆరోగ్యాన్ని చెక్ చేయిస్తున్నారా అని అడిగారు భట్టి. వసతులు, సిబ్బంది, డ్యూటీ నర్స్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు డిప్యూటీ సీఎం. రెండు వారాల వ్యవధిలో పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదస్థితిలో చనిపోయారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అసలు, ఈ పాఠశాలలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపించారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో భట్టి, పొన్నం స్కూల్‌ను సందర్శించారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు వారి రెసిడెన్షియల్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని భట్టి హామీ ఇచ్చారు. గురుకులాల పరిధిలో ఔషద, పండ్ల మొక్కలు పెంచుతామని, విద్యార్థులకు బెడ్లు, దుప్పట్లు అందజేస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతామని, ప్రతి శాసన సభ్యుడు, కలెక్టర్ వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు ఒకసారైనా పిల్లలతో కలిసి భోజనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. పిల్లలు, తల్లిదండ్రుల్లో ధైర్యం నింపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. ఇద్దరు విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన, ఘటన జరగ్గానే స్థానిక ప్రజా ప్రతినిధులు ఇక్కడకు వచ్చారని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని తాము భావించామని, అందుకే ఇక్కడకు వచ్చామని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తమతో చర్చించారని, సమస్య పరిష్కారం కోసం ఖర్చుకు వెనకాడవద్దని సూచించారని అన్నారు. విద్య, వైద్యంపై పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం కలచివేసిందని తెలిపారు భట్టి విక్రమార్క.


విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు

రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలి. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి అస్వస్థతగా ఉంటే ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలి. పిల్లల హైట్, వెయిట్ రికార్డు చేయాలి. నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలి. ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల శుభ్రత, తరగతి గది హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకి అవగాహన కల్పించాలి. పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్ డీ లాంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలో ఆవరణలో శుభ్రంగా ఉంచాలి’’ అని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు.

పారిశుద్ధ్యంపై రివ్యూ

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, ప‌చ్చ‌ద‌నం, స్వ‌యం స‌హాయ‌క సంఘాల బ‌లోపేతంపై జిల్లా పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది శాఖ అధికారుల‌తో స‌చివాల‌యం నుంచి మంత్రి సీత‌క్క వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. గ‌త ప్ర‌భుత్వంలో చికెన్ గున్యా వంటి విష జ్వ‌రాల‌తో గ్రామాలకు గ్రామాలు మంచాన ప‌డ్డాయన్నారు. ఇప్పుడు అటువంటి ప‌రిస్ధితులు లేవని, జ్వ‌ర సర్వేలు చేసి నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నామని తెలిపారు. అయినా కూడా త‌ప్పుడు వార్త‌లు ప్రచారం చేస్తూ బ‌ద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చెప్పాలని, లేకపోతే ప‌నిత‌రం స‌రిగ్గా లేద‌నే సంకేతాలు వెళ‌తాయని చెప్పారు. ఇక నుంచి ప్ర‌తి నెలా మూడు రోజుల పాటు స్వ‌చ్ఛద‌నం ప‌చ్చ‌ద‌నం డ్రైవ్ కొన‌సాగుతుందని స్పష్టం చేశారు. పాముల‌తో ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉందని, క్లీనింగ్ మీద దృష్టి సారించాలని చెప్పారు. పారిశుద్ధ్య లోపాల‌పై వార్త‌లు వ‌స్తే స‌రిదిద్దుకోవాలని, ఉద్దేశ పూర్వ‌కంగా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు తీసుకోవాలని చెప్పారు.

ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులకు దిగింది. హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాలు తదితర విషయాలపై ఆకస్మిక సోదాలు జరిపారు. మల్లాపూర్‌లోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు ఎంత మంది, రికార్డుల్లో ఎంత మంది రాశారు అనే విషయంపై ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. హాస్టల్‌లో జరుగుతున్న అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా ఎస్సీ గురుకులాల్లో ఏసీబీ సోదాలు జరిపింది. ఈ సందర్భంగా భారీగా అక్రమాలు బయటపడ్డాయి. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని తేలింది. అలాగే, హాస్టల్ అటెండెన్స్‌లోనూ భారీగా అవకతవకలు వెలుగుచూశాయి.

జనగామ ఎస్సీ గురుకులంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, వసతులపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్‌లోని వంట సామగ్రిని తూకం వేసి పరిశీలించారు. గురుకులం నిర్వహణ టెండర్ల రిజిస్టర్లు, సిబ్బందిపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందించట్లేదని తనిఖీల్లో తెలిసిందని సాబయ్య తెలిపారు. విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని చెప్పారు. పిల్లల వాష్ రూమ్స్ అధ్వాన్నంగా ఉన్నాయన్న ఆయన, పూర్తి రిపోర్టు ఏసీబీ డీజీకి అందిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు జరిపారు అధికారులు. రికార్డులను పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని హాస్టళ్లు, గురుకులాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. బృందాలుగా విడిపోయి హాస్టళ్లలో సోదాలు నిర్వహించారు అధికారులు. సిద్దిపేట బీసీ హాస్టల్‌లో ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగగా, మెడికల్, సానిటర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అలాగే, నిజామాబాద్ జిల్లా కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. పిల్లలకు అందుతున్న కాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై ఆరా తీశారు. ఏసీబీ‌తో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖలకు సంబంధించిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. హాస్టల్‌లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు, వసతులపై ఆరా తీశారు.

Related News

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×