EPAPER

Telangana:తెలంగాణ ‘బండి’ అప్పులతో నడవాల్సిందేనా?

Telangana:తెలంగాణ ‘బండి’ అప్పులతో నడవాల్సిందేనా?

Telangana government news(Latest news in Telangana):
తీరు మార్చుకోని కేంద్రం బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణకు తలనొప్పి మొదలయింది. నాడు కేసీఆర్ ఎదుర్కొన్న నిధుల సమస్యే నేడు రేవంత్ ప్రభుత్వం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కేంద్రానికి పన్నుల చెల్లింపులలో ముందు వరసలో ఉండే తెలంగాణ నిధుల కేటాయింపులో మాత్రం చివరి వరసలో ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ ముందున్న లక్ష్యం ఒక్కటే..కేంద్రం మెడలు వంచి నిధులు రాబట్టడమా లేక సామరస్య ధోరణిలో ముందుకు వెళ్లడమా? కేసీఆర్ అప్పట్లో మోదీ సర్కార్ ను తన వాగ్దాటితో తీవ్ర స్థాయిలో తిట్టిపారేశారు. తను అధికారంలో ఉన్నన్నినాళ్లూ మోదీతో ఘర్షణ వైఖరి అవలంబించారు.


కేంద్రంపై కక్షకట్టిన కేసీఆర్

జాతీయ రాజకీయాలలో రాణించాలనే కోరికతోనో లేక తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమో మోదీపై కక్ష పెంచేసుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే ప్రధాని హోదాలో మోదీ విమానాశ్రమానికి చేరుకుంటే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఆయనను సాదరంగా ఆహ్వానించకుండా అవమానించారు కేసీఆర్. ఇన్ని చేసి ఢిల్లీలో తనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. చివరి ఐదేళ్లూ మోదీతో ఘర్షణ వైఖరే ప్రదర్శించారు కేసీఆర్. కేసీఆర్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు రాజకీయ మేధావులు.


ఆరు గ్యారెంటీలు అమలవ్వాలంటే..

కేంద్రంతో సన్నిహితంగా ఉండి ఉంటే నిధులకు లోటు ఉండేది కాదని..ఇదంతా కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతోనే మోదీ సర్కార్ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. అయితే దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఆరు గ్యారెంటీల మంత్రం బాగా పనిచేసింది. అయితే ఆరు గ్యారెంటీలకు నిధులు కూడా భారీగానే ఉండాలి.ఎలాగూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణ విషయంలో చేతులు ఎత్తేసింది. అందుకే తెలంగాణ బడ్జెట్ లో ఈ సారి రూ.70 వేల కోట్లు అప్పులు రిజర్వ్ బ్యాంకు నుంచి తెస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఈ అకడమిక్ సంవత్సరానికి 12 వేల కోట్లు తీసుకుంది రాష్ట్ర సర్కార్. కేంద్రం కూడా కేవలం పన్నులలో వచ్చే వాటాలతో సరిపుచ్చుకోమంటోంది కానీ ఒక్క పైసా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయకపోవడం గమనార్హం.

రియల్ ఎస్టేట్ మందగమనం

ఇప్పటికిప్పుడు ఆదాయం పెంచుకునే మార్గం కూడా ఏ కోశానా కనిపించడం లేదు రాష్ట్ర సర్కార్ కు. నిరుపయోగ భూములను అమ్ముకుందామని అనుకున్నా..రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగమనంతో సాగుతోంది. మొన్నటి దాకా ఏపీలో స్థబ్ధంగా ఉన్న రియల్ మార్కెట్ చంద్రబాబు సీఎం కావడంతో రాజధాని భూములకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రియల్ భూమ్ ఉండటంతో రియల్ వ్యాపారులంతా ఏపీ వైపే మొగ్గు చూపుతున్నారు. భూములపై పెట్టుబడులు పెట్టేవారు సైతం ఏపీ ల్యాండ్స్ పైనే దృష్టిపెట్టారు. దీనితో తెలంగాణ సర్కార్ ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతానికి అప్పులు చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఆదాయం పెరిగే అవకాశాలపై దృష్టి పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సంకేతాలు ఇచ్చారు.

స్నేహ హస్తమా ?..ఘర్షణ వైఖరా?

కేసీఆర్ లాగా కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించాలా లేక మోదీ సర్కార్ తో సన్నిహితంగా మెదలాలా అని సీఎం రేవంత్ రెడ్డి డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే రేవంత్ కు కేంద్రంలో బలమైన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అండగా ఉన్నారు. తెలంగాణ నిధుల విషయంలో పార్లమెంట్ లో మోదీని తప్పక నిలదీస్తారనే ధీమాతో రేవంత్ ఉన్నారు. కేంద్రం తలుచుకుంటే బడ్జెట్ కేటాయింపులలో కాకున్నా గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా విడుదల చేయవచ్చు..ఆ దిశగా రేవంత్ కేంద్రాన్ని ఒప్పిస్తారా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Big Stories

×