EPAPER

Praja Palana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..

Praja Palana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..

Telangana Government decided to hold the ‘Praja Palana’ Program: సెప్టెంబర్ 17.. ఈరోజు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. కొన్నేండ్ల సంవత్సరాల తరువాత నిజాం నిరంకుశత్వ పాలన నుంచి తెలంగాణ ఇదే రోజున.. అనగా 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్యంలో కలిసింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయితే, ఈ సెప్టెంబర్ 17న ప్రతీ ఏడాది కూడా తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా సెప్టెంబర్ 17 విషయంలో మాటల యుద్ధం తప్పడంలేదు. సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ వస్తున్నాయి.


ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలగాణ ప్రజాపాలన దినోత్సవం వేళ జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇటు 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

Also Read: గాంధీ ఆసుపత్రిలో దారుణం.. వైద్యురాలిపై దాడి


అయితే, గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై నెలకొన్న వివాదం గురించి తెలిసిందే. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్నది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇటు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపిన విషయం తెలిసిందే.

Related News

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అనుచరుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

Big Stories

×