EPAPER

Chairpersons for 37 Corporations: 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. పార్టీ కోసం కష్టపడిన నేతలకు అవకాశం

Chairpersons for 37 Corporations: 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. పార్టీ కోసం కష్టపడిన నేతలకు అవకాశం

Chairpersons For 37 Corporations


Chairpersons For 37 Corporations: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టింది. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. చాలా మంది నేతలు ఈ పదవులు ఆశించారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే పార్టీ విజయం కోసం కష్టపడిన నేతలకే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇచ్చింది . అలాంటి వారిని కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అదే విధానాన్ని అమలు చేసింది. మంచి విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని పార్టీ చేసింది. ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. పార్టీలో చురుకుగా పనిచేసే వారిని గుర్తిస్తోంది. వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చి గుర్తింపు, గౌరవాన్ని ఇస్తోంది.


కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు పొందిన నేతలు లోక్ సభ ఎన్నికల్లోనూ యాక్టివ్ గా పనిచేస్తారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకోసం కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు భర్తీ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా దక్కని నేతలకు ఇప్పుడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.

Also Read: ఆమే కింగ్ పిన్.. ఈడీ కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు..

అసెంబ్లీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోయిన నేతలను బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాంటి నేతలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన పదవి ఇచ్చి గౌరవిస్తోంది. మరికొందరు నేతలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.

కార్పొరేషన్ ఛైర్మన్ పదవి పొందిన నేతల వివరాలు..

పటేల్ రమేష్ రెడ్డి.. టారిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్
నేరెళ్ల శారద.. మహిళా కమిషన్
నూతి శ్రీకాంత్.. బీసీ ఆర్థిక సంస్థ
రాయ నాగేశ్వరరావు.. గిడ్డంగుల సంస్థ
ఎన్. ప్రీతమ్.. ఎస్సీ కార్పొరేషన్

శివసేనారెడ్డి.. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
ఈరవత్రి అనిల్.. ఖనిజాభివృద్ధి సంస్థ
జగదీశ్వరరావు .. ఇరిగేషన్ డెవలప్ మెంట్ సంస్థ
మెట్టు సాయికుమార్.. మత్స్య సహకార సంఘాల సమాఖ్య
గురునాథ్ రెడ్డి పోలీసు గృహనిర్మాణ సంస్థ
జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విజయా డెయిరీ

బెల్లయ్య నాయక్.. గిరిజన సహకార ఆర్థిక సంస్థ
జంగా రాఘవరెడ్డి.. ఆయిల్ ఫెడ్
రియాజ్ గ్రంథాలయ పరిషత్
నిర్మల .. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
అన్వేష్ రె్డడి.. విత్తనాభివృద్ధి సంస్థ
విజయబాబు.. రాష్ట్ర సహకార గృహనిర్మాణ సమాఖ్య

కాసుల బాలరాజు.. ఆగ్రోస్
శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ
మానాల మోహన్ రెడ్డి.. రాష్ట్ర సహకార యూనియన్
చల్లా నరసింహారెడ్డి.. అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
నాగు.. గిరిజన సహకార, ఆర్థికాభివృద్ధి సంస్థ
జనక్ ప్రసాద్ ..కనీస వేతన సలహా మండలి

వీరయ్య.. దివ్యాంగుల సంస్థ
నాయుడు సత్యనారాయణ.. హస్త కళల సంస్థ
ఎం.ఎ . జబ్బార్.. మైనార్టీల ఆర్థిక సంస్థ వైఎస్ ఛైర్మన్
మల్ రెడ్డి రాంరెడ్డి.. రోడ్డు అభివృద్ధి సంస్థ
కాల్వ సుజాత.. వైశ్య సంస్థ
పొదెం వీరయ్య .. అటవీ అభివృద్ధి సంస్థ
ప్రకాశ్ రెడ్డి.. రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్
నరేందర్ రెడ్డి.. శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ
పుంజాల అలేఖ్య.. సంగీత నాటక అకాడమీ
గిరిధర్ రెడ్డి .. ఫిలిం డెవలప్ మెంట్ సంస్థ
మన్నె సతీశ్ కుమార్.. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ
జైపాల్.. అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ
వెంకట్రామిరెడ్డి .. కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ
ఎం.ఎ. ఫహీం.. తెలంగాణ ఫుడ్స్

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×