EPAPER

Telangana Elections : ఒంటరిగా మిగిలిన షర్మిల దారి ఎటు?

Telangana Elections : ఆంధ్రాలో పుట్టి తెలంగాణ రాజకీయాలలో పాదయాత్రతో అడుగుపెట్టిన వైస్ షర్మిల ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోయింది. కొన్ని రోజుల వరకు కాంగ్రెస్‌తో పొత్తు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి చివరికి ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతోంది.

Telangana Elections : ఒంటరిగా మిగిలిన షర్మిల దారి ఎటు?

Telangana Elections : ఆంధ్రాలో పుట్టి తెలంగాణ రాజకీయాలలో పాదయాత్రతో అడుగుపెట్టిన వైస్ షర్మిల ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోయింది. కొన్ని రోజుల వరకు కాంగ్రెస్‌తో పొత్తు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి చివరికి ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతోంది.


ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. షర్మిల స్థాపించిన వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రచారాలు చేస్తున్నట్లు కనబడలేదు. నిజానికి తెలంగాణ ప్రజలపై షర్మిల పార్టీ ప్రభావం అంతంతమాత్రమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అందుకే పాదాలు అరిగేలా నడిచినా అటు ప్రజలు కానీ తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ షర్మిలను అస్సలు పట్టించుకోలేదు. ఇక తన నడకకు సెలవిచ్చి కాంగ్రెస్ పార్టీ హస్తం అందుకోవాలని ఆమె హస్తిన దాక వెళ్లినా చివరకు నిరాశే ఎదురైంది. తెలంగాణ రాజకీయాలలో సాధించేదేమీ లేదు.. ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తామని ఢిలీ నాయకులు షర్మిలకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.


కానీ ఆంధ్రపదేశ్‌ రాజకీయాలలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు ఆమె సోదరుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతను తన భుజాలపై వేసుకుని తన శక్తి మేర పార్టీని నడపించింది.

ఉదాహరణకు ‘నా పుట్టినిల్లు ఆంధ్రాలోనే, నేను పుట్టింది ఇక్కడే’ అంటూ అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపున పాదయాత్రలు చేసి ‘బై బై బాబు’ అంటూ నినాదాలిచ్చి మొత్తానికి వైఎస్ఆర్ పార్టీని ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయించిన ఘనత షర్మిలకు దక్కుతుంది.

అయితే ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్న షర్మిల పరిస్థితి ఇప్పుడు ‘జగనన్న వదిలేసిన బాణంగా’ మిగిలిపోయింది. నేను పుట్టింది ఇక్కడే నా రాజకీయం ఇక్కడే అనుకున్న షర్మిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే జగన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. ఆమెను మెల్లగా పార్టీ వ్యవహారాల నుంచి తప్పించారు.

సోదరుడు తనకు చేసిన అన్యాయంతో ఆమె తెలంగాణ రాష్ట్రం వైపు చూసింది. తెలంగాణ మా అత్తగారిల్లు, నా పిల్లలు పుట్టిన ప్రాంతం ఇది.నా తండ్రి పరిపాలించిన నేల ఇది. ఇక్కడ రాజన్న రాజ్యం స్థాపించి ఈ నేల ఋణాన్ని, జన్మనిచ్చిన తండ్రి ఋణాన్ని తీర్చుకుంటాను అంటూ శపథం చేసి వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది.

పార్టీ స్థాపించిన కొంతకాలంపాటు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, అధికార బీఆర్ఎస్ పార్టీపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడేది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కొంత హల్ చల్ చేసింది. కానీ ఇదంతా మూన్నాళ్లముచ్చట్టగా కనిపించింది.

కట్ చేస్తే ప్రస్తుతం.. తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రజలకు ప్రధాన పార్టీలు మా పార్టీ గెలిస్తే ఇది ఫ్రీగా ఇస్తాం.. అది ఫ్రీగా చేస్తాం.. అంటూ మేనిఫెస్టోలు, హామీలు ప్రకటిస్తున్నాయి. టికెట్లు దొరకని పార్టీల కండువాలు మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే.. షర్మిల మాత్రం మౌనంగా.. దీనంగా పరిస్థితులను చూస్తూ ఒంటరిగా మిగిలిపోయారు.

అయితే.. తెలంగాణ ఎన్నికల తరువాత కొన్ని నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఉన్నాయి. ఇక్కడకాకపోతే అక్కడ షర్మిల మకాం మార్చే అవకాశం లేకపోలేదు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×