EPAPER
Kirrak Couples Episode 1

Telangana Elections : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని కక్కిస్తాం.. బీఆర్ఎస్‌పై రాహుల్ ఫైర్

Telangana Elections : అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతినే ప్రధాన ఎజెండాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది . రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఇదే విషయం పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంతటితో ఆగకుండా షెడ్యూల్ పెంచుకుని మరీ.. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పరిశీలించి వచ్చారు.

Telangana Elections : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని కక్కిస్తాం.. బీఆర్ఎస్‌పై రాహుల్ ఫైర్

Telangana Elections : అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతినే ప్రధాన ఎజెండాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది . రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఇదే విషయం పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంతటితో ఆగకుండా షెడ్యూల్ పెంచుకుని మరీ.. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పరిశీలించి వచ్చారు. కేసీఆర్ సర్కార్ పై దూకుడు మరింత పెంచారు.


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రధాన ప్రచారాంశంగా మార్చిన కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అవినీతిని ఎండగట్టేందుకు అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది. రాహుల్ గాంధీ షెడ్యూల్ లో లేకపోయినా మార్పులు చేర్పులు చేసుకుని మేడిగడ్డ బ్యారేజ్ పరిధిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కుంగిన పిల్లర్ల దగ్గరికి వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత డ్యామ్ ఫోటోలు తీశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో చేసిన స్కాంలో మేడిగడ్డ ఒక భాగమన్నారు. కొన్ని పిల్లర్లలో పగుళ్లు వచ్చాయన్నారు రాహుల్. నాణ్యతా లోపంతో నిర్మించడం వల్లే ఈ బారేజీ కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందన్న మోడీ, అమిత్ షా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ఫైర్‌ రాహుల్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని, తాము అధికారంలోకి రాగానే ఆ అవినీతి కక్కిస్తామంటూ ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం విషయంలో ఇటు బీఆర్ఎస్ తీరును, బీజేపీ సైలెన్స్‌ను ఒక్క దెబ్బతో కౌంటర్ చేస్తున్నారు రాహుల్.


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంత జరిగింది.. డ్యామేజ్ ఎంత జరిగింది.. ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటి అన్న విషయాలను జనంలో చర్చ పెట్టేందుకు రాహుల్ స్వయంగా మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్లారు. నిజానికి లక్ష కోట్ల ఖర్చుతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోతే హుటాహుటిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లాల్సింది. కానీ ఈ ముగ్గురు సహా మంత్రులు ఇతర బీఆర్ఎస్ నేతలు అసలు కాళేశ్వరంవైపు కన్నెత్తి చూడడం లేదు.

ప్రభుత్వంలో ఉన్న వారు ఇంకా బాధ్యతగా ఉండాలి. డ్యామేజ్ ఎంత జరిగింది.. ఎక్కడ లోపం తలెత్తింది.. బాధ్యులు ఎవరు అన్నది ఆర్డర్ వేయాలి. కానీ విచిత్రంగా ఇవేవీ జరగడం లేదు. కేసీఆర్ మొదలుకుని అంతా సైలెంట్ అయ్యారు. బ్యారేజ్ పిల్లర్ కుంగడం చిన్న విషయమే అంటూ కవరప్ చేసుకుంటున్నారు. నిర్మాణ సంస్థే రిపేర్ చేస్తుందని ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. గతంలోనూ పంపులు మునిగిపోతే వాళ్లే రిపేర్ చేసి ఇచ్చారని చెబుతూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే.. మేడిగడ్డ కుంగక ముందు.. ప్రచార సభల్లో కేసీఆర్ కాళేశ్వరం గురించి ఘనంగా చెప్పారు. ఎప్పుడైతే మేడిగడ్డ కుంగిందో.. అప్పటి నుంచి కాళేశ్వరం పదాన్ని కూడా కేసీఆర్ పలకడం లేదు.

మరోవైపు బీజేపీ నేతలు కూడా కాళేశ్వరంపై మునుపు మాట్లాడినట్లు ఇప్పుడు మాట్లాడడం లేదు. గతంలో మోడీ, అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు… కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసి వెళ్లారు. కానీ ఇప్పుడు ప్రచారాలకు వస్తున్నా.. వీటిపై మాట కూడా మాట్లాడడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే.. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ సర్కార్ కు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలితీసుకుంటే.. ఇప్పుడు ఆ ప్రాజెక్టే కేసీఆర్‌ను బలి తీసుకుంటున్నారు రేవంత్‌ రెడ్డి. గుడినీ, గుడిలో లింగాన్నీ దిగమింగిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం శిక్షించాలని.. కేసీఆర్ అవినీతి కుండ పగిలింది కాబట్టే.. మేడిగడ్డ కుంగిందంటూ కౌంటర్ వేశారు. బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ కాపాడుతోందంటూ ఆ రెండు పార్టీల తీరును ఆయన ఎండగడుతున్నారు. కేసీఆర్ అంటే ఇప్పుడు కాళేశ్వరం కరప్షన్ రావు అయ్యారంటున్నారు. ప్రాజెక్టును నిర్మించిన ఎల్‌అండ్‌ టీ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని.. సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×