EPAPER

DGP JITHENDER : సమస్య ఉంటే కోర్టుకు వెళ్లాలి, రోడ్ల మీదకు వస్తే ఉరుకోం… డీజీపీ జితేందర్ వార్నింగ్

DGP JITHENDER : సమస్య ఉంటే కోర్టుకు వెళ్లాలి, రోడ్ల మీదకు వస్తే ఉరుకోం… డీజీపీ జితేందర్ వార్నింగ్

DGP JITHENDER : తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ మేరకు డీజీపీ జితేందర్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.


డిస్టర్బ్ చేస్తే బాగుండదు…

శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఎవరైనా కావాలని సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టప్రకారం చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.


షెడ్యూల్డ్ ప్రకారమే ఎగ్జామ్స్…

ఇక ఉన్నత న్యాయస్థానం తీర్పు మేరకే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల నిర్వహణలో అవాంతరాలు సృష్టిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమన్నారు.

అమరవీరుల సంస్మరణ…

అక్టోబర్ 21 నుంచి 31 వరకు తెలంగాణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ గా విధులు నిర్వర్తిస్తూ అమరులైన సిబ్బందికి, అధికారులకు శాఖ తరఫున నివాళులర్పిస్తామన్నారు.

నిందితులకు కఠిన శిక్షలు… 

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ మేరకు నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరైందని కాదని హితవు పలికారు.

రంగంలోకి డీజీపీ…

దీంతో డీజీపీ జితేందర్ శనివారం మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షని సజావుగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

శాంతిభద్రతలను పరిరక్షించాలన్న లక్ష్యంతోనే శుక్రవారం గ్రూప్ -1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనను నియంత్రించామన్నారు. కోర్టులకు వెళ్లకుండా రోడ్ల మీదికి వచ్చి నిరసనలతో, సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోమన్నారు.

జీఓ నెం 55 అమలుకు డిమాండ్… 

తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల తర్వాత తొలిసారిగా మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు పరీక్షలకు అంతా రెఢీ అవుతోంది. నిరుద్యోగులు జీఓ 29ను రద్దు చేయాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో జీఓ నెం. 55ను అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

స్టోరీ ఏంటంటే…

గ్రూప్ 1 మెయిన్స్‌కు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఎటువంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు పటిష్ట బందోబస్తు నడుమ జరిపించేందుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

ఇక గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీలో తప్పులున్నాయని, ఫలితంగా పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే మెయిన్స్‌ను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు దాఖలైంది. ఫైనల్‌ కీలో తప్పులు ఉండటం సహా పలు కారణాలతో ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలన్న పిటిషన్ ను సింగిల్‌ జడ్జి బెంచ్ కొట్టేసింది.

దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ వాటినీ కొట్టివేస్తూ చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యంకాదని సూచించింది. ఇలాంటి సమయంలో పరీక్షల వాయిదాకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టనిచ్చింది. ఫలితంగా గ్రూప్‌ 1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది.

also read : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. లక్ష్యాలు, ప్రత్యేకతలు ఇవే..!

Related News

BANDI SANJAY : గ్రూప్ 1 అభ్యర్థుల కోసం హోంమంత్రి బండి సంజయ్ నిరసన, ఆపై తీవ్ర ఉద్రిక్తత, అరెస్ట్

CM Revanth Reddy: దొంగ నాటకాలు.. మానుకోండి.. కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ హెచ్చరిక

Miyapur Chirutha Puli: మియాపూర్‌లో కనిపించింది చిరుత కాదా? మరేంటి? అధికారులు ఏమంటున్నారు? అయినా బీ అలర్ట్!

Young India Skill University: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. లక్ష్యాలు, ప్రత్యేకతలు ఇవే..!

BRS leader ship change: అయ్యా గమ్మునుండు, నేను చూసుకుంటా.. ఆ సంకేతాలు దేనికి?

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Big Stories

×