EPAPER

Telangana Debts | అప్పులు చేయడంలో తెలంగాణ టాప్ 2.. రిజర్వ్ బ్యాంక్ నివేదిక!

Telangana Debts | అప్పు.. అప్పు … అప్పు…. ఎటూ చూసినా అప్పులే.. ఏ పని చేసినా అప్పులే.. ఇదీ గత కేసీఆర్ సర్కార్ తీరు. సంపద సృష్టి మాట అటుంచితే.. అన్ని పనులు పూర్తిగా రుణాలపై చేసినవే. పైగా వాటి చెల్లింపులకు మార్గం ఏంటన్నది కూడా క్లారిటీ లేకుండానే. ఏదో చల్తీకా నామ్ గాడీ మాదిరిగా వ్యవహరాలు నడిపింది గత సర్కార్. తలసరి అప్పు అయినా, గ్యారెంటీ అప్పు అయినా… ఏదైనా తెలంగాణదే రికార్డు అన్నట్లుగా గత ప్రభుత్వం వ్యవహారాలు నడిపింది. అది కాస్తా ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారిపోయింది.

Telangana Debts | అప్పులు చేయడంలో తెలంగాణ టాప్ 2.. రిజర్వ్ బ్యాంక్ నివేదిక!
Telangana Debts

Telangana Debts(TS news updates):

అప్పు.. అప్పు … అప్పు…. ఎటూ చూసినా అప్పులే.. ఏ పని చేసినా అప్పులే.. ఇదీ గత కేసీఆర్ సర్కార్ తీరు. సంపద సృష్టి మాట అటుంచితే.. అన్ని పనులు పూర్తిగా రుణాలపై చేసినవే. పైగా వాటి చెల్లింపులకు మార్గం ఏంటన్నది కూడా క్లారిటీ లేకుండానే. ఏదో చల్తీకా నామ్ గాడీ మాదిరిగా వ్యవహరాలు నడిపింది గత సర్కార్. తలసరి అప్పు అయినా, గ్యారెంటీ అప్పు అయినా… ఏదైనా తెలంగాణదే రికార్డు అన్నట్లుగా గత ప్రభుత్వం వ్యవహారాలు నడిపింది. అది కాస్తా ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారిపోయింది.


2021-22లో రాష్ట్రాలు చేసిన గ్యారెంటీ అప్పులకు సంబంధించిన వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసింది. సోమవారం రిలీజ్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ డాక్యుమెంట్ 2023-24 ప్రకారం దేశంలోనే ఉత్తరప్రదేశ్ అత్యధిక రుణాలు కలిగి ఉందని తెలిపింది. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉండగా.. మూడో ప్లేస్ లో ఏపీ నిలిచింది. యూపీ అంటే పెద్ద రాష్ట్రం. జనాభాకు తగ్గట్లు అప్పులు, సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు అవసరమవుతుంటాయి. అలాంటి యూపీతో పోటీ పడి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నది పెద్ద ప్రశ్న.

గత ఏడాది మర్చినాటికి 1.71 లక్షల కోట్ల రుణాలతో ఉత్తర ప్రదేశ్ టాప్ లో నిలవగా.. 1.35 లక్షల కోట్లతో తెలంగాణ రెండో ప్లేస్ లో నిలిచింది. ఇదే క్రమంలో 1.17 లక్షల కోట్లతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 2014లో కేవలం 62,822 కోట్లుగా ఉన్న తెలంగాణ గ్యారెంటీ రుణాలు.. 2021లో లక్ష కోట్ల మార్కుకు చేరుకున్నాయి. అదన్న మాట సంగతి. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన ఇటీవలే ఆర్థిక శాఖపై రివ్యూ కూడా చేశారు. త్వరలోనే శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటు దగ్గర్నుంచి డిసెంబర్ వరకు చేసిన ఖర్చులు.. తీసుకొచ్చిన నిధులు అప్పులు ఇలా అన్నిటి లెక్కలు తేల్చాలని తొలి మంత్రివర్గ సమావేశాల్లోనే నిర్ణయించారు.


ఇప్పుడు తెలంగాణ సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సృష్టించడమే మార్గం. ఈ అప్పులు వడ్డీలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ తీరాలంటే పన్నుయేతర ఆదాయాలను పొందడంలో సహాయపడటానికి ఆస్తి మానిటైజేషన్‌ ను పరిశీలించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ లో తెలిపింది. నిరుపయోగంగా ఉన్న భూముల ఆస్తులపై సమగ్ర సమీక్ష చేపట్టి, ఆదాయాన్ని సమకూర్చే పారిశ్రామిక ఎస్టేట్‌ లుగా మార్చడం లేదా పూర్తిగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమీకరించాలని సిఫార్సు చేసింది.

రాష్ట్రంలో మొత్తం అప్పుల్లో ఏడాదిలోపే చెల్లించాల్సినవి 3.6 శాతం ఉన్నాయి. ఏడాది పైన, అయిదేళ్లలోపు చెల్లించాల్సినవి 26.5%, అయిదేళ్లపైన, 10 ఏళ్లలోపు చెల్లించాల్సినవి 11.5%, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు చెల్లించాల్సినవి 37.5%, 20 ఏళ్ల తర్వాత చెల్లించాల్సినవి 21% ఉన్నాయి. రాష్ట్ర పన్నుల రాబడిలో సొంత పన్నుల ఆదాయం వాటా 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 73.2, 72.8, 72.7 శాతంగా ఉంది.

మరోవైపు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏటేటా వీటి అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయానికి ఉచిత కరెంటు మొదలు ప్రభుత్వ ఆఫీసులకు వాడే విద్యుత్ వరకు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోతున్నాయి. ట్రూ అప్ చార్జీల భారాన్ని ఐదేళ్ల పాటు భరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ చెల్లింపులూ లేవు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ కోసం సుమారు 3 వేల కోట్లు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. సింగరేణి సంస్థకు కూడా తెలంగాణ జెన్ కో దాదాపు 20 వేల కోట్లకు పైగా బకాయి పడ్డట్లు చెబుతున్నారు. డిస్కంల ఆస్తులకంటే అప్పులే ఎక్కువ ఉన్నట్లు తేలింది.

రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు, విద్యుత్‌ సరఫరా సంస్థ, విద్యుదుత్పత్తి సంస్థతో కలిపి మొత్తం 4 సంస్థలకున్న అప్పులు తెలంగాణ ఏర్పడిన 2014-15 నాటికి 22,423 కోట్లుంటే ఇప్పుడు 81,516 కోట్లకు చేరాయి. వీటిలో విద్యుత్‌ కొనుగోలు చేసినందుకు బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు తీసుకున్న స్వల్పకాలిక రుణాలే 30,406 కోట్లున్నాయి. ఈ స్వల్పకాలిక రుణాల వల్ల నెలకు వడ్డీల రూపంలో 1000 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రస్తుత డిసెంబరు నుంచి వచ్చే 2024 మే నెలాఖరుకు రాబోయే ఆరు నెలల్లో కరెంటు బిల్లులు వసూలు, ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రాయితీతో కలిపి మొత్తం ఆదాయం 22,781 కోట్లు ఉంటుంది. కానీ ఇదే ఆరు నెలల్లో ఖర్చులు 33,839 కోట్ల వరకు ఉంటాయని డిస్కంల అంచనా. ఆదాయ, వ్యయాల మధ్య లోటు 11,058 కోట్లు ఉంటుందని తేలింది. ఇప్పటికే రెండు డిస్కంల నష్టాలు 50,275 కోట్లకు చేరాయి. కరెంటు కొన్నందుకు డిస్కంలు నెలనెలా విద్యుదుత్పత్తి సంస్థలకు 3,305 కోట్లు చెల్లించాలి. ఇవి కాకుండా గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీల వాయిదాలకు నెలకు 1,457 కోట్లు కట్టాలి. ఈ రెండూ కలిపితే ఖర్చులు 4762 కోట్లు అవుతోంది. విద్యుత్‌ సంస్థల అప్పులు 81,516 కోట్లుగా లెక్క తేలింది. మొత్తం అస్తవ్యస్తం.

మరోవైపు బ్యాంకులకు ష్యూరిటీ ఇవ్వడం తప్ప సివిల్ సప్లయ్స్‌ ‌శాఖకు గత ప్రభుత్వం పైసా ఆర్థిక సాయం చేయకపోవడంతోనే వేలకోట్ల అప్పులు పెరిగాయంటున్నారు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏటా 3,645.25 కోట్లు వడ్డీలకే పోతున్నాయన్నారు. బీఆర్ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఫైనాన్స్‌‌‌‌ మిస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ చేసిందన్నారు. విద్యుత్ శాఖ 81వేల కోట్ల అప్పుల్లో, ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులవే 10 వేల కోట్ల బాకీలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ ధాన్యం సేకరణ కోసం 50 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. ఇలా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌‌‌‌లను ఫైనాన్స్‌‌‌‌ మిస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ చేసిందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై తలసరి రుణభారాన్ని మోపారన్న విమర్శలను గత కేసీఆర్ ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ స్కీముల ద్వారా వచ్చే ఫండ్స్‌ను సైతం రాష్ట్ర అవసరాలకు వేరే స్కీములకు డైవర్ట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గత పదేళ్లలో జరిగిన ఆర్థిక అవకతవతలు, దుబారా అంశాలను ప్రజలకు విడమర్చి చెప్పాలని, కొత్త ప్రభుత్వంపై మోపిన భారాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలనుకుంటున్నారు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Big Stories

×