EPAPER
Kirrak Couples Episode 1

Telangana Debts : తెలంగాణ అప్పులకుప్ప!

Telangana Debts : తెలంగాణ అప్పులకుప్ప!

Telangana Debts : పదేళ్లలోనే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కేసీఆర్ సర్కారు హయాంలో రుణాలు మేరుపర్వతంలా పేరుకుపోయాయి.దశాబ్ద కాలంలో తెలంగాణ చేసిన అప్పులు మొత్తం రూ.6 లక్షలు. ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఇది వెల్లడైంది. ప్రస్తుతం అప్పుల మొత్తం 6,71,757 కోట్లకు చేరింది. తెలంగాణ ఏర్పడే నాటికి రుణభారం రూ.72,658 కోట్లు మాత్రమే. అంటే పదేళ్లలోనే రుణభారం దాదాపు పదిరెట్లు పెరిగిందన్నమాట.


ఇక FRBM లోన్లు రూ.3,89,673 కోట్లు దాటిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన గ్యారెంటీ అప్పులు రూ.1,27,208 కోట్లకు చేరాయి. కార్పొరేషన్లు చెల్లించాల్సిన గ్యారెంటీ అప్పులు రూ.95,462 కోట్లకు చేరినట్టు శ్వేతపత్రం తెలిపింది. కార్పొరేషన్లు చెల్లించాల్సిన నాన్‌ గ్యారెంటీడ్ అప్పులు రూ.59,414 కోట్లు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

బడ్జెటేతర(ఆఫ్ బడ్జెట్) రుణాల మొత్తంలో పెరుగుదల వల్ల ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పినట్లయింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల పేరిట బడ్జెటేతర రుణాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన వనరుల కోసం స్పెషల్ పర్సస్ వెహికల్స్(SPV) ఏర్పాటయ్యాయి. అయితే ఆఫ్ బడ్జెట్ రుణాల భారీ సమీకరణతో పాటు SPVలకు రాబడులు లేకపోవడంతో.. బడ్జెట్ వనరుల నుంచే రుణ చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


రుణాలకు వడ్డీ చెల్లింపులే రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగాయి. మరో 35 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే కేటాయించాల్సి వస్తోంది. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కాసులు కరువయ్యాయి. 2014లో వంద రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడది పది రోజులకు తగ్గింది. ఇక రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు తెచ్చినా.. పదేళ్ల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(GSDP)లో రెవెన్యూ రాబడుల శాతం కూడా పెరిగింది లేదు. అప్పులు తెచ్చి చేసిన వ్యయానికి అనుగుణంగా గత పదేళ్లలో ఆస్తుల సృష్టి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రాబడులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గరిష్ఠంగా 2015-16లో 13.2% గా ఉండగా.. 2018-19లో 11.8 శాతానికి క్షీణించాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి కన్నాముందే రెవెన్యూ రాబడుల్లో క్షీణత నమోదు కావడం గమనార్హం.

గత పదేళ్లలో బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయానికి పొంతన లేకుండా పోయింది. 2014-15లో మొత్తం బడ్జెట్ అంచనాల్లో వాస్తవ వ్యయం కనిష్ఠ స్థాయిలో.. అంటే 61.9 శాతంగా ఉంది. పదేళ్లలో సగటున ఖర్చు చేసింది 82.3 శాతమే. ఇక 2021-22లో బడ్జెట్, వాస్తవ వ్యయాల మధ్య అంతరం తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది.

ఆ ఆర్థిక సంవత్సరంలో 79.3% మాత్రమే తెలంగాణ ఖర్చు చేసింది. అంటే అంచనాలు, వాస్తవ వ్యయం మధ్య అంతరం 20 శాతం కన్నా ఎక్కువగానే ఉంది. పంజాబ్ వాస్తవ వ్యయం 74.7 శాతానికే పరిమితమైంది. ఈ అంశానికి సంబంధించి 92 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్ అట్టడుగున ఉన్నాయి. ఇక రాజస్థాన్(116.4%), కర్ణాటక(113.1), మధ్యప్రదేశ్(110.6), కేరళ(100.7) రాష్ట్రాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి.

Related News

KTR: రాజకీయ సన్యాసం స్వీకరిస్తా.. పొంగులేటి సవాల్ స్వీకరించిన కేటీఆర్

CLP Meeting: ప్రారంభమైన సీఎల్పీ సమావేశం.. ఎవరెవరు హాజరయ్యారంటే?

Phone Tapping: 4,500 ఫోన్లు ట్యాప్ చేశారు.. 80 శాతం ఎయిర్‌టెల్ కస్టమర్లే

Singareni Dussehra Bonus: అది బోనస్ కాదు.. పచ్చి బోగస్: కేటీఆర్

Bandi Sanjay: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై మహేష్ కుమార్ ప్లాన్ ఇదే!

Big Stories

×