EPAPER

Telangana Debts | అప్పుల ఊబిలో తెలంగాణ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం!

Telangana Debts | తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుంది. గత ప్రభుత్వ విధానాలతో సింపుల్ గా అయ్యే పనులు తడిసి మోపెడయ్యాయి. అవి అప్పుల రూపంలో కొత్త ప్రభుత్వంపై భారం మోపాయి. అవసరం లేకున్నా కొన్ని పనులను ముందేసుకోవడం, వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టడం వంటి చర్యలతో భారం పెరిగిపోయింది.

Telangana Debts | అప్పుల ఊబిలో తెలంగాణ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం!
ts politics

Telangana Debt news(TS politics):

తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుంది. గత ప్రభుత్వ విధానాలతో సింపుల్ గా అయ్యే పనులు తడిసి మోపెడయ్యాయి. అవి అప్పుల రూపంలో కొత్త ప్రభుత్వంపై భారం మోపాయి. అవసరం లేకున్నా కొన్ని పనులను ముందేసుకోవడం, వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టడం వంటి చర్యలతో భారం పెరిగిపోయింది. పైగా కేంద్ర ప్రభుత్వం నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోకపోవడం, ప్రతి దానికి అప్పుల పైనే ఆధారపడడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.


60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని బీఆర్ఎస్ సర్కార్.. పదేళ్లలోనే చేసి చూపించామని మాజీ సీఎం కేసీఆర్ పదే పదే బహిరంగ సభల్లో ప్రస్తావించారు. అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా.. అప్పులు మాత్రం ఐదారు రెట్లు పెరిగిపోయాయి. తెలంగాణ ఏర్పడే నాటికి 61 వేల 711 కోట్ల అప్పులు ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి అది 3 లక్షల 66 వేల 306 కోట్లకు చేరుకుంది. వీటికి తోడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా గత ప్రభుత్వం స్టేట్ డెవలప్ మెంట్ లోన్ పేరుతో 36 వేల 378 కోట్ల రూపాలను అప్పుగా తీసుకున్నారు. దీంతో మొత్తం అప్పు 4 లక్షల 2 వేల 684 కోట్లకు చేరింది. ఇక డిస్కంల అప్పులు 81 వేల 516 కోట్లు… కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నది 97 వేల కోట్లు, మిషన్ భగీరథ కోసం 23,984 కోట్లు, కలిపితే మొత్తం అప్పు 6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే కాకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను గత బీఆర్ఎస్ సర్కార్ రహస్యంగానే ఉంది. ఇవి కూడా కలిపితే అప్పుల భారం మరింత ఎక్కువ.

దశాబ్ది వేడుకల సందర్భంగా గత సర్కార్ ప్రగతి నివేదిక అంటూ ఓ రిపోర్ట్ ను ప్రచురించింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, దళితబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి ఇలా అనేక రకాలుగా ఏయే స్కీమ్ కింద ప్రజలకు ఏ మేరకు లబ్ది చేకూర్చిందో తెలిపింది. తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిందని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నామని పేర్కొన్న గత సర్కార్.. తలసరి అప్పు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, రాబోయే ప్రభుత్వాలమీద మోయలేని భారాన్ని మోపిందని అప్పట్లోనే కాంగ్రెస్ సీరియస్ అయింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గత కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు, ఆర్థిక నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేసే పనిలో ఉంది.


రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రానికి 1.48 లక్షల కోట్ల అప్పు ఉంటే తెలంగాణ వాటా 61,711 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా రిజర్వు బ్యాంకు నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గరా, ద్రవ్య సంస్థల నుంచి అప్పులు తీసుకుంటూనే వచ్చారు. ప్రతి ఏటా సగటున 40 వేల కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ రూపంలో తీసుకున్న అప్పు, ప్రస్తుతం ఔట్ స్టాండింగ్ గా ఉన్నది 4,02,684 కోట్లు. 25 ఏళ్లలో తీర్చేలా రుణం తీసుకున్నందున ఇకపైన వచ్చే ప్రభుత్వాలు 2045 వరకూ క్రమంగా తీర్చడం కంపల్సరీగా మారింది.

కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు వీటికి అదనం. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు తన వార్షిక రిపోర్ట్ లో చెబుతూనే వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 97,449 కోట్లను ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంది గత కేసీఆర్ సర్కార్. వీటికి 2035 ఆగస్టుకల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉంది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు 9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% అంటే 23,984 కోట్లు రుణం రూపంలో తీసుకున్నదే.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం అప్పులు తీసుకున్న గత సర్కార్ ను తిరిగి రీ పేమెంట్ చేయడానికి ఉన్న మార్గమేంటని కాగ్ తన రిపోర్టుల్లో ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క పైసా ఆదాయం రాకపోగా ప్రతి ఏటా పంపుల వినియోగం కోసం విద్యుత్ బిల్లుల చెల్లింపు మోయలేని భారంగా ఉంటుందని, అప్పులు తీర్చడానికి వేటి మీద ఆధారపడుతుందని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. మిషన్ భగీరథ విషయంలోనూ ఆదాయం రాని స్కీమ్‌గానే ఉన్నదని, తిరిగి రుణాల చెల్లింపునకు ఉన్న మార్గాలేంటని నిలదీసింది. దీనికి నాటి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. గతంలో చేసిన అప్పుల్ని తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది అదీ లెక్క. వాటిపైన వడ్డీ చెల్లింపులే ప్రభుత్వానికి గుదిబండగా మారింది.

పాత అప్పులు తీర్చేందుకు ఏడాది మొత్తానికి 5,925 కోట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బడ్జెట్‌లో పేర్కొంటే ఆ తర్వాతి సంవత్సరానికి అది 7,554 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ పదేళ్లలో చేసిన అప్పులకు ప్రతి నెలా క్వార్టర్‌కు వడ్డీ చెల్లించడం అనివార్యం కావడంతో డెట్ సర్వీస్ పేరుతో ఈ ఏడాది 22,407 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలా చెల్లిస్తున్న వడ్డీ మొత్తం కేవలం రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించినదే. ఇక కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపులు దీనికి అదనం. కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అప్పులు చేయడంతో గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించింది. రిజర్వుబ్యాంకు ద్వారా తీసుకునే అప్పుల్లో కోత పెట్టింది. ఆ ఆంక్షలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకూ కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులపై గత ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Big Stories

×