EPAPER

Government Salaries and Pensions : ఫస్ట్‌కే జీతాలొచ్చాయి.. హామీలన్నీ నిలబెట్టుకుంటున్న కొత్త సర్కార్..!

Government Salaries and Pensions : ఫస్ట్‌కే జీతాలొచ్చాయి.. హామీలన్నీ నిలబెట్టుకుంటున్న కొత్త సర్కార్..!


Government Salaries and Pensions : ప్రత్యేక తెలంగాణలో ఫస్టుకే జీతాలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్యోగుల కల. కానీ, కేసీఆర్ పాలనలో ఇది సాధ్యం కాలేదు. 10 దాటితేగానీ జీతాలు పడేవి కావు. ఒక్కోసారి 15వ తేదీ దాటిన సందర్భాలూ ఉన్నాయి. వాయిదాల పద్దతిలో శాఖలను విభజించి జీతం డబ్బులు వేసేవారు. కానీ, కాంగ్రెస్ పాలనలో టైమ్ టు టైమ్ జీతాలు పడేలా చూసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు శుక్రవారం (మార్చి 1) వారివారి ఖాతాల్లో జమ అయ్యాయి. 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,88,000 పెన్షన్ దారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి.

నెల మొదటి తారీఖునే జీతాలు పడటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ డేట్‌నే జీతాలు పడే అనవాయితీ ఉండేది. కానీ, కేసీఆర్ హయాంలో మొదటి వారం నుంచి మూడో వారం వరకు.. అసలు, శాలరీలు వస్తాయో లేదో తెలియక ఉద్యోగులు అయోమయానికి గురయ్యేవారు. ఈఎంఐలు క్లియర్ చేసుకునేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, కాంగ్రెస్ పాలనలో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. డిసెంబర్‌లో అధికారాన్ని చేపట్టిన రేవంత్ సర్కార్.. ఆ నెల జీతాన్ని త్వరగానే జమ చేసింది.


Read More: 8 ఏళ్ల సమస్య.. హైదరాబాద్ – కరీంనగర్ ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్

జనవరి నెల జీతం డబ్బులు అలాగే వేసింది. ఫిబ్రవరి జీతం అయితే మార్చి 1వ తేదీనే జమ చేసింది. తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. దీన్ని గాడిలో పెట్టుకుంటూ ఎవరికీ ఏ కష్టం రాకుండా సర్దుబాటు చేస్తామని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెబుతూ వస్తున్నారు. ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఇంకోవైపు ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నారు. దీంతో ఉద్యోగ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×