EPAPER

Congress 6 Guarantees : పట్టాలెక్కిన ప్రగతి పాలన.. 90 రోజుల్లోనే 3 హామీల అమలు

Congress 6 Guarantees : పట్టాలెక్కిన ప్రగతి పాలన.. 90 రోజుల్లోనే 3 హామీల అమలు


Congress 6 Guarantees : లెక్కకు మించిన అంచనాలు, ఊహించనన్ని సమస్యల మధ్య పాలనలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల పాలన పూర్తి చేసుకునే దిశగా సాగిపోతోంది. ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేసుకుంటూనే.. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు వడివడిగా అడుగులు వేసింది. సర్కారు వచ్చిన తొలినాళ్లలోనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేస్తామన్న హామీని నిజం చేయగా, ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా పది లక్షలకు పెంచటం జరిగింది. ఇక.. ఫిబ్రవరి నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో ఇచ్చిన హామీల్లో మూడు నెరవేర్చినట్లయింది. మిగిలిన హామీల అమలుకు తగిన విధి విధానాలు రూపకల్పన దశలో ఉన్నాయి. వాటికి అవసరమైన ఆర్థిక వనరులు, విధాన పరమైన నిర్ణయాలను తీసుకునేందుకు సీఎం ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు మార్చి 11 నుంచి రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించే పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శనివారం నాటి సమీక్షా సమావేశంలో.. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనున్నారు. ఎన్ని దశల్లో ఈ నిధులను విడుదల చేయాలి? నిధులు దుర్వినియోగం చూడటం, వంటగది, టాయిలెట్, బెడ్ రూమ్, హాల్ వచ్చేలా డిజైన్ల రూపకల్పనకు ఆదేశాలు జారీ అయ్యాయి.


Read More :“కుటుంబ పార్టీలను నమ్మకండి.. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్”

తెలంగాణలోని గర్భిణీలు, బాలింతలకు సరైనపౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలకూ సీఎం సిద్ధమయ్యారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా లేదా? ఆ కేంద్రాల్లో పౌష్ఠికాహారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాలు పెట్టాలని, ఆడిటింగ్ కోసం ఇకపై అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు రంగం సిద్ధమైంది. అవసరమైన చోట మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలకూ ఆదేశాలిచ్చారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలివ్వటంతో పాటు ఈ భవనాలన్నీ ఒకేలా ఉండేలా డిజైన్ చేసే పని సాగుతోంది.

దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల అమలుకు సీఎం ఆదేశాలిచ్చారు. ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అందించేలా ఫైలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వృద్ధాశ్రమాల ఏర్పాటు, ట్రాన్స్ జెండర్లకు వైద్య సదుపాయాలు, వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం వంటి వాటికీ ప్రభుత్వం చొరవ తీసుకుంది.

సీఎం హోదాలో తొలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత దానిని ప్రధాని దృష్టికీ తీసుకెళ్లి ఫాలో అప్ చేయటంతో నేడు తెలంగాణకు ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి)సంస్థ మంజూరైంది. దీని వల్ల తెలంగాణ విద్యార్థులు టెక్స్ టైల్స్ డిజైనింగ్, అప్పారల్స్ డిజైనింగ్, మార్కెటింగ్ , ఇంటర్నేషనల్ ట్రేడ్ లాంటి అంశాల్లో టెక్నికల్ డిగ్రీ, డిప్లొమాలను పొందడానికి వీలు ఏర్పడింది. గతంలో దీనికోసం మన విద్యార్థులు ఏపీ, ఒరిస్సాలకు వెళ్లాల్సి వచ్చేది.

Read More : దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

గత పదేళ్ల కాలంలో గతి తప్పిన అనేక ప్రజాస్వామిక సంప్రదాయాలకూ రేవంత్ సర్కారు తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడటంతో బాటు అందులో విపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించటం ఒకటి. అలాగే.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా, గణాంకాలతో సహా శ్వేత పత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచి, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్, విద్య, మహిళా వికాసం వంటి కీలక అంశాల మీద ప్రభుత్వం చర్చించి నిర్ణయాలను ప్రకటించింది. పదేళ్ల పాటు రైతులకు నిద్ర లేకుండా చేసిన ధరణి సమస్యల పరిష్కారానికి ఈ నెల 9 నుంచి స్పెషల్ డ్రైవ్‌నూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

అదే విధంగా వారంలో రెండు రోజులు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో సామాన్యులను కలిసి, వారి గోడును వినే మంచి సంప్రదాయం మొదలైంది. దీనికి ఎంతగా స్పందన వస్తోందంటే.. అటు సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం వద్ద కూడా రోజూ వందలాది మంది ప్రజలు తమ వెతలను ఆయనను కలిసి వెళ్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో సామన్యులిచ్చే దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించింది.

పదేళ్లుగా దగాకు గురైన నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకూ పెంచింది. దీనితో బాటు 11 వేలకు పైచిలుకు టీచర్ పోస్టుల నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తై నియమాక పత్రాల కోసం ఎదురుచూసిన స్టాఫ్ నర్సులు, పోలీసు కానిస్టేబుళ్లకూ సీఎం స్వయంగా నియమాక పత్రాలను అందించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. మరోవైపు ఐదేళ్ల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చి వారికి అండగా నిలిచే ప్రయత్నమూ చేశారు.

మరోవైపు రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా రైతుబంధు సాయం అందించే చర్యలు ఊపందుకున్నాయి. అన్నీ కుదిరితే.. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మరిన్ని హామీల అమలుకు సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై ఇన్నాళ్లుగా నిరాశ పడిన తెలంగాణ సమాజానికి రవ్వంత ఊరట, రేపటి పట్ల నమ్మకం ఏర్పడుతున్నాయి.

Related News

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Big Stories

×