EPAPER

CM Revanth Reddy: 8 నెలల రేవంత్ సర్కారు పనితీరుపై సర్వే.. ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?

CM Revanth Reddy: 8 నెలల రేవంత్ సర్కారు పనితీరుపై సర్వే.. ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?

CM Revanth Reddy: తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు పారిపాలించింది. ఆ తరువాత మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మొత్తం పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. ఈ పదేళ్లూ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొనసాగారు.


అయితే, ఇటీవలే.. అనగా గతేడాది చివరలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఊహించని విధంగా తీర్పు ఇచ్చారు. ఈసారి వందకుపైగా సీట్లను సాధిస్తామనుకున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం వారికి 39 సీట్లు మాత్రమే ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. 64 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తుంది. గత 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ‘అగ్ని న్యూస్ సర్వీస్’ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. రేవంత్ సర్కారు తీరు ఎలా ఉందనేది నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నది. ‘పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ’ అనే పేరుతో ఈ సర్వేను నిర్వహించింది. రేవంత్ సర్కారు ఏర్పడిన గత 8 నెలలపై మీ అభిప్రాయం ఏమిటంటే.. తెలంగాణ ప్రజలను అడిగి తెలుసుకున్నది. వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో రేవంత్ సర్కారుకు శుభవార్త చెప్పింది. సర్కారు పనితీరుపై ఎక్కువమంది ప్రజలు మంచి అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించింది. 72 శాతం మంది ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని, 21 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్లుగా సర్వేలో తేలిందని వెల్లడించింది.

Also Read: రుణమాఫీ అమలు.. రాజీనామాపై హరీష్ రావు రియాక్షన్ ఇదే..


ఈ సర్వేకు సంబంధించిన వివరాలు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. సర్వేను ఆగస్టు 1 నుంచి 10 మధ్య నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9,665 శాంపిల్స్ తీసుకున్నట్లు, తెలంగాణ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సర్వేలో పలు రంగాలకు సంబంధించిన వారు.. ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు, పురుషులు, మహిళలు, శ్రామిక వర్గాలు పాల్గొన్నట్లు చెప్పారు. 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడుగగా, సంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. రేవంత్ సర్కారు పనితీరు అంచనాలకు మించి ఉందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి పరిపాలన పరంగా రాణించగలరా? అనే భయాలు అన్ని వర్గాల్లో కనిపించాయని, కానీ.. సర్వే ఫలితాల్లో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

Also Read: విదేశీ పర్యటన వెనుక ఉన్న లక్ష్యాలేమిటంటే..!

ఈ సర్వేపై కాంగ్రెస్ నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన రావడం పట్ల తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి సర్కారుదేనంటూ కంగ్రాట్స్ చెప్పారు. ప్రభుత్వం తమ పార్టీ అధిష్టానం మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిక్ష పార్టీలు తమ తీరును మార్చుకోవాలన్నారు. అనవసరం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి విమర్శంచడం సరికాదన్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×