EPAPER

Telangana CM KCR : అంతన్నారు.. ఇంతన్నారో.. కేసీఆర్ సార్..

Telangana CM KCR : అంతన్నారు.. ఇంతన్నారో.. కేసీఆర్ సార్..

Telangana CM KCR : అంతన్నాడు.. ఇంతన్నాడో.. కేసీఆర్ సార్.. తెలంగాణ రాష్ట్రమంతా ఎక్కడికెళ్లినా ఇదే పాట మార్మోగుతోంది. అంతన్నాడు..ఇంతన్నాడో.. మా కేసీఆర్ సారు.. ముంతకింద పప్పన్నాడో మా కేసీఆర్ సారు.. అంటూ ప్రతిపక్ష నేతలు జనానికి వినిపిస్తున్నారు.


ఎందుకంటే గడిచిన పదేళ్లలో లెక్కకు మిక్కిలి హామీలిచ్చుకుంటూ కేసీఆర్ వెళ్లిపోయారు.  ఇప్పుడవే కేసీఆర్ మెడకు చుట్టుకున్నాయని అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు వాటినే అడుగుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవీ అంటున్నారు.. ఇంటికొక ఉద్యోగం వస్తుందన్నావు..దళితబంధు అన్నావు, రుణమాఫీ అన్నావు, మూడెకరాల భూమి అన్నావు, రోడ్లు అన్నావు, బ్రిడ్జిలు అన్నావు, రైతులకు మద్దతు ధర అన్నావు..ఇలా ఒకటా రెండా నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడి అరచేతిలో వైకుంఠం చూపించావని తిట్టిపోస్తున్నారు.

అంతన్నావు.. ఇంతన్నావు అవన్నీ ఏమయ్యాయి? కేసీఆర్ సారూ.. అని ముఖం మీదే అడుగుతున్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని అన్నావు. మీ కుటుంబం బతుకులు, మీ బీఆర్ఎస్ నాయకుల బతుకులే బాగుపడ్డాయని మండిపడుతున్నారు.


బంగారు తెలంగాణ అన్నావు, ఇత్తడి తెలంగాణ అయిపోయింది. మొత్తం అప్పుల కుప్పగా మార్చేశావని దుమ్మెత్తిపోస్తున్నారు. నమ్మి అధికారం ఇస్తే నట్టేట ముంచేశావని లబోదిబోమంటున్నారు. ఇంకా ఎన్నాళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తావు అని అంటున్నారు. నువ్విచ్చిన హామీలే నీ పాలిట శాపాలుగా మారనున్నాయని అంటున్నారు.

నీళ్లు అన్నావు.. ఇంటికొక కుళాయి అన్నావు, సస్యస్యామలం అయిపోతుందన్నావు.. ఏడాదికి మూడు పంటలు అన్నావు.. తీరా పండిద్దాం అంటే, వరి వేయకండి, వరి వేస్తే ఉరే అన్నావు,  ప్రభుత్వం కొనదన్నావు. పూటకొక మాట, గంటకొక పాట పాడతావు. నిన్న చెప్పిందే ఈ రోజు గుర్తుండదు. ఇక పదేళ్ల నుంచి చెబుతున్నవేం గుర్తుంటాయిలే అని వ్యంగ్యంగా అంటున్నారు.

ప్రాజెక్టుల పేరు చెప్పి గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేయించారు. వారికి ఎన్ని ఆశలు పెట్టాలో అన్నీ పెట్టారు. అలా సర్వం కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగు చేసుకోడానికి పట్టా భూమి, ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు, పెళ్లి ఖర్చు కోసం, అదే అబ్బాయి ఉంటే రూ.2 లక్షలు స్వయం ఉపాధి కోసం ఇస్తామన్నారు.  అంతేకాదుప్రాజెక్టులో భూమి పోతే, దానికి నష్టపరిహారం ఇస్తూ, దానికి సమానంగా అంతకు అంత వేరేచోట భూమి ఇస్తానన్నావు. అదీ పోయింది. అలాగే వీళ్లందరికీ పునరావాస గ్రామాలు నిర్మించి ఇస్తానని నమ్మించి, ఆశ పెట్టి ఆ అమాయక ప్రజలను ఊళ్ల నుంచి వెళ్లగొట్టారు.వారందరూ ఇప్పుడు రోడ్డున పడ్డారని వాపోతున్నారు.

పాపం ప్రజలేమంటున్నారంటే, మా ఊరు బాగుపడితే, మాకు అంతకన్నా సంతోషం ఏం ఉంది? ఎన్నాళ్లని ప్రభుత్వాలతో పోరాడతామని అంటున్నారు. అలాగే వారందరికీ ఈరోజున తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చేసుకోడానికి పనిలేదు. దీనంతటికి ప్రధాన కారణం కేసీఆర్ అనే అంటున్నారు. తీసుకునేటప్పుడు తేనే మాటలు చెప్పి తీసుకోవడం, తర్వాత మీ దిక్కున్న చోట చెప్పుకోండి అనడం.. తెలంగాణ రాష్ట్రమంతా ఇదే తంతు నడుస్తోందని అంటున్నారు. ఈ వాతావరణం అంతా చూస్తుంటే, ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కి గడ్డు కాలమేనని చెప్పాలి.

Related News

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Big Stories

×