– సన్నబియ్యానికి రూ.500 బోనస్
– ములుగు సెంట్రల్ వర్సిటీకి భూమి
– ఉస్మానియా ఆస్పత్రికి భూబదలాయింపు
– ఆ రెండు జిల్లాల పరిధి పెంపుకు పచ్చజెండా
– ఏటూరు నాగారం.. ఇక రెవెన్యూ డివిజన్
– మద్దూరును మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్
– కేబినెట్ సబ్ కమిటీ నివేదికలపై చర్చ
– పలు కీలక నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్
హైదరాబాద్, స్వేచ్ఛ: Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ శనివారం భేటీ అయింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీల అమలు తీరు, మేనిఫెస్టోలోని ఇతర అంశాల మీద కేబినెట్ సమావేశం చర్చించింది. దీనితో బాటు ఇప్పటి వరకు పలు అంశాల మీద ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అనంతరం పలు కీలక అంశాలను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
మంత్రివర్గం ఆమోదించిన అంశాలు..
ములుగులో సమ్మక్క-సారలమ్మ సెంట్రల్ వర్సిటికి ఎకరం రూ. 250కే భూముల కేటాయింపు
కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు అంగీకారం
హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు గ్రీన్ సిగ్నల్
ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ఆమోదం
సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు నిర్ణయం
రేరాలో 54 ఉద్యోగాలు భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రుణ సేకరణకు ఆమోదం