EPAPER

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం..కోమటిరెడ్డి వర్సెస్ హరీష్‌రావు!

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం..కోమటిరెడ్డి వర్సెస్ హరీష్‌రావు!

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది.


బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ బడ్జెట్ పై ఏమైనా మాట్లాడుతారని ఎదురు చూశామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చీల్చి చెండారతారని అనుకుంటే ఏం మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

కోమటిరెడ్డిని హరీష్ రావు హాఫ్ నాలెడ్జ్ అంటూ విమర్శలు చేశారు.  ఈ వ్యాఖ్యలకు మంత్రి కోమటి రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆకారం పెరిగింది కానీ తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై మంత్రి విరుచుకుపడ్డాడు. మీ మామ.. కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిండా? లేదా? అని ప్రశ్నించాడు. కేసీఆర్ కేబినేట్‌లో హరీష్ రావు డమ్మీ మంత్రి అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని కట్టించారా? అని దుయ్యబెట్టారు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.


Also Read: గొర్రెల స్కీమ్‌లో రూ.700 కోట్ల అవినీతి.. విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లకు పీసీపీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని అన్నారా లేదా అంటూ కోమటిరెడ్డిని ప్రశ్నించారు. కలెక్టరేట్లు, సచివాలయాలను కేసీఆర్ అద్భుతంగా కటించారని కోమటిరెడ్డి ప్రశంసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిందని విమర్శలు చేశారు.

Tags

Related News

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Big Stories

×