EPAPER

Telangana Assembly Sessions: అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై వాడీవేడిగా చర్చ..కేటీఆర్‌పై సీతక్క ఫైర్!

Telangana Assembly Sessions: అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై వాడీవేడిగా చర్చ..కేటీఆర్‌పై సీతక్క ఫైర్!

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందుకోసం బుధవారం కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ప్రస్తుతం ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ మొదలైంది. మొదట బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను ప్రారంభించారు.


తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణ చీకట్లో నిండిపోతుందని సరిగ్గా పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అని ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది అన్నారని గుర్తు చేశారు. అలాగే ఈ పదేళ్లల్లో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారన్నారు.

బడ్జెట్‌లోని అంశాలు మేనిఫెస్టో లేవని కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ బడ్జెట్ అద్భుతంగా ఉందని ఆర్‌బీఐ చెబుతుందని, రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో అప్పగించామన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై విస్తృతంగా చర్చ జరగాలని, అవసరమైతే అర్ధరాత్రి వరకు చర్చ జరపాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.


కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. మీ హయాంలో అర్హత లేనివారికి పథకాలు ఇచ్చారన్నారు. మీరు పదేళ్లుగా చేయని పనులు చేసి చేపిస్తున్నామన్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్ పాలన కోట శ్రీనివాస్ కోడి కూర కథలాగా ఉండేదన్నారు. లక్షల మంది పేదలు ఇళ్లు లేక బాధపడుతున్నారని, బీఆర్ఎస్ పదేళ్లలో ఎవరికి ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు.

ఉద్యోగ విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. మేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ప్రకటించారని, అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా ? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో ప్రజలు సంతో షంగా ఉన్నారన్నారు. త్వరలోనే ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తామన్నారు.

Also Read: గత ప్రభుత్వంలో అప్పులేనా ? ఆస్తుల గురించి చెప్పరా? : కేటీఆర్

అబద్ధాలను సైతం అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని మంత్రి సీతక్క సెటైర్ వేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇస్తే..ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మ్మ నుంచి రికవరీ చేశారని, ఈ విషయం మా దృష్టికి రాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారన్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు ధరణిలో పేరు లేదని రైతుబంధు నిలిపివేశారన్నారు. ప్రతిరోజు ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అంటే..బయట ఉన్నా మేము నిజమేనని అనుకున్నామన్నారు. బీఆర్ఎస్ జరుగుతున్న అవినీతిని తట్టుకోలేక ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×