EPAPER

Assembly budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఇలాంటి తీర్మానం పెట్టడం..

Assembly budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఇలాంటి తీర్మానం పెట్టడం..

Assembly budget session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంట లకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య సాయన్నకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశ పెట్టడం బాధగా ఉందన్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులన్నారు. చాలా ఏళ్లగా ఇద్దరు కలిసి పని చేశామని గుర్తుచేశారు. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించారన్నారు.

తండ్రి వారసత్వాన్ని తీసుకుని లాస్య ప్రజాజీవితంలోకి వచ్చారన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజల తరపున పోరాడుతారని భావించామని, దురదృష్టశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని వివరించారు. కంటోన్మెంట్ ప్రజల మనసుల్లో శాశ్వతంగా సాయన్న, లాస్య నిలిచి పోతారన్నారు. వారు చేయాలనుకున్న పనులను ప్రబుత్వం పూర్తి చేస్తుందన్నారు. లాస్య మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.


ALSO READ: రెండో విడత రైతు రుణమాఫీకి రేవంత్‌ సర్కార్‌ సిద్ధం.. వచ్చేవారమే ఖాతాల్లోకి..

కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సంతాపం తెలిపా రు. ఆయన ఆదేశాలలో సభలో సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశా లను బుధవారం నాటికి వాయిదా వేశారు స్పీకర్.

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×