EPAPER
Kirrak Couples Episode 1

AP TS: అప్పుల కుప్పగా తెలుగు రాష్ట్రాలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

AP TS: అప్పుల కుప్పగా తెలుగు రాష్ట్రాలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

AP TS: తెలంగాణ అంటే అప్పుల రాష్ట్రం. ఏపీ అయితే అప్పుల కుప్పే. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పదే పదే చేసే ఆరోపణ ఇది. తెలంగాణలో ప్రతీ ఒక్కరి మీద లక్షన్నర అప్పు ఉందంటూ కమలనాథులు తరుచూ చెబుతుంటారు. ఏపీలో ఒక్కొక్కరిపై 2 లక్షలకు పైగానే అప్పుందంటూ టీడీపీ గోల గోల చేస్తుంటుంది. సంపన్న రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చేశారంటూ విమర్శిస్తుంటారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పుబెల్లం పంచుతూ ఏపీని దివాళా తీయించారనేది చంద్రబాబు, పవన్ ల ఆరోపణ. ఇంతకీ తెలంగాణ చేసిన అప్పు ఎంత? ఏపీ నిజంగానే అప్పుల కుప్పనా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే అంటోంది.


తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. తెలంగాణలో 2018లో 1.60 లక్షల కోట్లు అప్పు ఉండగా.. 2022 నాటికి అది 3.12 లక్షల కోట్లకు చేరిందని కేంద్రం స్పష్టం చేసింది. 2017-18లోనే 95.9 శాతం అప్పులు నమోదైనట్టు తెలిపింది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి అప్పుల శాతం కాస్త తగ్గి.. 16.7 శాతానికి చేరినట్టు తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం వెల్లడించింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తరువాత భారీగా పెరిగి.. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు ఉన్నాయని పార్లమెంట్ లో తెలిపింది కేంద్రం.


ఇక, ఏపీ సైతం అదే తీరు. ఆంధ్రప్రదేశ్ లో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు ప్రకటించింది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు 2.29 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం 3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2017-18లో గతంతో పోలిస్తే 9.8 శాతం అప్పులు తగ్గగా.. 2020-21 నాటికి అప్పులు 17.1 శాతం పెరిగినట్టు తెలిపింది.

ఏపీ జీడీపీలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉండగా.. 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది. 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన వివరాలు చూస్తే.. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో దిగబడిపోతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు. సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

Related News

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Big Stories

×