Telangana: తెలంగాణ బీజేపీ యమ జోరు మీదుంది. బండికి అసలు బ్రేకులే లేకుండా దూసుకుపోతున్నారు. కిషన్‌రెడ్డి, అర్వింద్, రఘునందన్, రాజాసింగ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి.. ఇలా ఎవరూ తగ్గట్లే. ఎవరి స్థాయిలో వాళ్ల పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్‌లో ఉంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికల సంగ్రామం ముందుంది. ఇలాంటి కీలక సమయంలో కర్నాటక పరాజయం ఆ పార్టీ స్పీడ్‌కు స్పీడ్ బ్రేకర్‌గా మారనుందా? జోరు.. నీరుగారి పోతుందా? భవిష్యత్ అంతా బీజేపీదే.. ఇండియా మొత్తం కాషాయమే.. అనే ప్రచారం పక్కకు పోతుందా? తెలంగాణ బీజేపీపై కర్నాటక ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఇవే ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
ఫస్ట్ ఎఫెక్ట్ చేరికల మీద ఉంటుందంటున్నారు. బీజేపీ దూకుడు చూసి.. ఇతర పార్టీల్లోని అసంతృప్తులు కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. పొంగులేటి, జూపల్లి లాంటి బలమైన నాయకులతో పాటు.. నియోజకవర్గాల వారీగా చాలామంది నేతలు కమలం వైపు ఆశగా చూస్తున్నారు. కమలదళంలో కలిసిపోతే.. ఫ్యూచర్ ఫెంటాస్టిక్‌గా ఉంటుందని కలలు కంటున్నారు. అలాంటి వారి స్వీట్ డ్రీమ్స్‌పై యాసిడ్ పోసినట్టు అయింది కర్నాటక రిజల్ట్స్.
మోదీ, షాలు అంతగా ప్రచారం చేసినా.. వారి సభలు, రోడ్‌షోలు అంతలా సక్సెస్ అయినా.. జై బజరంగ్ భలీ నినాదం అంతగా మారుమోగినా.. కేరళ స్టోరీ రిలీజైనా.. కర్నాటకలో అవేవీ వర్కవుట్ కాకుండా.. కాంగ్రెస్ ఘన విజయం సాధించడం మామూలు విషయం కాదు. మారుతున్న రాజకీయ భవిష్యత్తుకు ఇది నిదర్శనం అంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర బాగా వర్కవుట్ అయిందంటున్నారు. ప్రియాంక గాంధీ షోలు సక్సెస్ అయ్యాయని చెబుతున్నారు. సునీల్ కనుగోలు స్ట్రాటజీలు బ్రహ్మాండంగా పని చేశాయని ఫిక్స్ అయిపోతున్నారు. ఇలా వేవ్ అంతా కాంగ్రెస్ వైపు ఉంటే.. బీజేపీలో చేరేందుకు ఎవరు ముందుకొస్తారు? అనే సందేహం వినిపిస్తోంది.
బీజేపీ ఎంతగా హడావుడి చేస్తున్నా.. అది అర్బన్ పార్టీ అనే ముద్ర ఇప్పటికీ ఉంది. గ్రామాలు, మండలాల్లో కాంగ్రెస్‌కు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. రేవంత్‌రెడ్డి రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్షరేషన్‌తో ఆసక్తికర హామీలు ఇస్తున్నారు. బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీపై.. మత రాజకీయాలు చేస్తుందని, విద్వేశాలను రెచ్చగొడుతుందని పలు రకాల విమర్శలు ఉన్నాయి. దక్షిణాదిన ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోవడం.. కాంగ్రెస్‌కు క్రేజ్ పెరుగుతుండటంతో.. బీఆర్ఎస్‌ను వీడాలనుకునే వాళ్లు.. ఇప్పుడు బీజేపీకా? కాంగ్రెస్‌లోకా? అనే సందిగ్థంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
కర్నాటక, తెలంగాణ ఓటర్ల మధ్య అనేక సారూప్యతలు కూడా ఉంటాయి. భౌగోళికంగా పక్క పక్కనే ఉండటం.. అలవాట్లు, ఆలోచనలో పోలికలు ఉండటం.. అక్కడ బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ ఉంటే, ఇక్కడ హైదరాబాద్ మహానగరం ఉండటం.. ఈ రెండు నగరాలు ఐటీ కేంద్రాలు కావడం చూస్తుంటే.. కర్నాటకలో బీజేపీని తిరస్కరించినట్టే.. తెలంగాణలోనూ కమలనాథులను ఓటర్లు రిజెక్ట్ చేస్తారా? అనే డౌట్ రాకమానదు. అందుకే, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తాత్కాలికంగా చెక్ పడుతుందా? కర్నాటక ఫలితాల తర్వాత పొంగులేటి చూపెటు?