EPAPER

T-SAT Network: టీ-శాట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

T-SAT Network: టీ-శాట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

T-SAT Network CEO Venugopal Reddy


T-SAT Network CEO Venugopal Reddy: తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వేణుగోపాల్‌ రెడ్డి.. బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ రంగ ఛానళ్లలో నెంబర్ వన్‌గా టీ-సాట్ ను తీర్చిదిద్దడమే లక్ష్యమని వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.

ప్రజా ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఛానల్ విస్తరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే అకడమిక్, కాంపిటేటివ్ రంగాల్లో అందిస్తున్న సేవల్ని మరింత విస్తృతపర్చటం సహా.. విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర, సాంకేతికత రంగాల్లోకి టి-సాట్ నెట్వర్క్ తీసుకెళ్తామని తెలిపారు, ప్రస్థుతం నడుస్తున్న నిపుణ, విద్యా ఛానళ్లకు అదనంగా మరిన్ని చానళ్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు వేణుగోపాల్‌ రెడ్డి.


ప్రభుత్వరంగ ఛానళ్లలో నెంబర్ వన్‌గా టీ-సాట్ ను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు TSAT CEO వేణుగోపాల్‌రెడ్డి. తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజాప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఛానల్ విస్తరణ ఉంటుందని బిగ్‌టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. నిపుణ, విద్యా ఛానళ్లకు అదనంగా మరిన్ని చానళ్లను తీసుకువస్తామని తెలిపారు.

Read More: పేదల కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం.. పదేళ్లు మోసం : సీఎం రేవంత్ రెడ్డి

బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్. జర్నలిజంలో ఆయనకు 17 సంవత్సరాల అనుభవం ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్ ఆయన స్వగ్రామం. విద్యార్థిగా ఉన్నపుడే ఆయన తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×