EPAPER

Swargaseema Suketana Scam: మాయలమరాఠీ చండ్ర చంద్రశేఖర్.. చెప్పేవన్నీ అబద్ధాలే..

Swargaseema Suketana Scam: మాయలమరాఠీ చండ్ర చంద్రశేఖర్.. చెప్పేవన్నీ అబద్ధాలే..

Swargaseema Suketana Scam: స్వర్గసీమ.. సుకేతన.. ఇప్పుడు టీవీ ఆన్ చేసినా.. ఎఫ్‌ఎం పెట్టినా.. చివరకు పేపర్ చూసినా.. ఎక్కడ చూసినా దాని ప్రకటనలే. రకరకాల గెటప్‌ల్లో మాయల మరాఠీలా స్వర్గసీమ ఓనర్‌ ప్రత్యక్షమవుతూ.. మా దగ్గర ఫ్లాట్ కొనండంటూ చెప్పే చండ్ర చంద్రశేఖరే కనిపిస్తారు.. కస్టమర్లకు లాభం చేయడం కోసమే తాను లాభాలు ఆశించడం లేదని.. 33 పర్సెంట్ తక్కువ ధరకే ప్లాట్లు అమ్ముతున్నానంటూ కలరింగ్‌ ఇస్తుంటారు.. మరి స్వర్గసీమ సుకేతనలో అంతా పక్కాగానే ఉందా.. లేదంటే ఏదైనా గోల్‌మాల్ జరుగుతోందా..?


ప్లాట్లు కొనాలనుకునే వాళ్లకు స్వర్గసీమ ఓనర్‌ చెప్పే మాటిది.. కరెక్టే.. ఏదైనా కొనేముందు పాలేంటో నీళ్లేంటో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అందుకే.. సుకేతనలో పాలెంత.. నీళ్లెంత అని తేల్చడానికి సుకేతన ప్రాజెక్టు పూర్వాపరాలను తవ్వితీసింది బిగ్‌టీవీ. అక్కడే.. ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.. రంగురంగుల గెటప్‌లు వేసుకుని.. కలర్‌ఫుల్‌ యాడ్స్‌తో జనాన్ని మాయ చేస్తున్న చండ్ర చంద్రశేఖర్ చేసిన లీలలు బయటపడ్డాయి. అవన్నీ తెలుసుకుంటే అక్కడ ప్లాట్ కొనడం సేఫేనా.. భవిష్యత్తులో ఆ ప్లాట్ మన పేరు మీదే ఉంటుందా అన్న డౌట్స్‌ ఎవరికైనా రావాల్సిందే..

ఫస్ట్ పాయింట్.. హైదరాబాద్‌కు అతి చేరువలో.. షాద్‌నగర్‌కు దగ్గరగా అంటూ ప్రకటనలు గుప్పించింది స్వర్గసీమ. షాద్‌నగర్‌కు కేవలం 25 నిమిషాల దూరంలోనే సైట్ అంటూ బ్రోచర్‌లో పెట్టారు. కానీ.. ఒక్కసారి గూగుల్‌ మ్యాప్ చూడండి.. షాద్‌నగర్‌కు సుకేతన లేఅవుట్ ఉన్న చెరుకుపల్లికి వెళ్లడానికి రెండు రూట్లున్నాయి. ఏ రూట్‌లో వెళ్లినా కనీసం 41 నిమిషాల సమయం పడుతుందని గూగుల్ చెబుతోంది. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ లాంటి ప్రాంతాల నుంచి అయితే దూరం 80 కిలోమీటర్ల పైమాటే. వెళ్లడానికి కనీసం రెండు గంటలకు పైనే సమయం పడుతుంది.. ఇక్కడే చండ్ర చంద్రశేఖర్ చేసిన మాయ అర్థం అయిపోతుంది. గచ్చిబౌలి ఆఫీస్‌లో గ్రాండ్‌గా ఉన్న బ్రోచర్లు చూపించేసి కస్టమర్లను బుట్టలో వేసుకోవడానికి చేసిన మోసం అని.. ఇలాంటి మాయలు సుకేతన లేఔట్‌లోకి అడుగుపెడితే.. మరెన్నో కనిపిస్తాయి.


రెండో పాయింట్‌.. గజం విలువ రూ.10 వేలు. మధ్యతరగతి మీద ప్రేమతో 33% డిస్కౌంట్‌. అంటే రూ.6700కే గజం. ఈ మాట వినగానే అబ్బ ఎంత మంచోడురా అనే ఎవరైనా అనుకుంటారు. కానీ.. అసలు విషయం తెలిస్తే ఎంతగా ముంచాడన్నది అర్థమైపోతుంది. అక్కడ భూమికి గజం రేట్ రూ.10 వేలని ఫిక్స్ చేసిందెవరు..? చండ్ర చంద్రశేఖరే. ఆషాడం డిస్కౌంట్‌ టైప్‌లో రేట్లు పెంచేసి డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు.. తనకు తానే భారీ రేటు పెట్టి.. దానిమీద డిస్కౌంట్ అంటూ ఊరించే ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ భూమి విలువ గజం 11వందల నుంచి 13వందలు.. మార్కెట్‌లో అమ్ముడయ్యేది 15వందలకే. కానీ.. దానికి ఏడు రెట్ల ధరను ఫిక్స్‌ చేసి.. దానికి కాస్త డిస్కౌంట్‌ ఇచ్చి భారీగా ప్రాఫిట్ కొట్టేస్తున్నారు చండ్ర చంద్రశేఖర్‌.

అలా కస్టమర్లు ఇస్తున్న ప్రాఫిట్‌తోనే.. ఇన్ని గెటప్‌లు.. ఇన్ని యాడ్స్‌ ఇవ్వగలుగుతున్నాడని అనడంలో డౌటే లేదు. ఇలా గచ్చిబౌలిలో కూర్చోబెట్టి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌, పొలిటీషియన్స్‌కు బాగానే ప్లాట్లను అంటగట్టేసింది స్వర్గసీమ. డిసెంబర్‌ 31st వరకే ఆఫర్‌ అని.. ఇంతకాలం హడావుడి చేసిన చండ్ర చంద్రశేఖర్ ఆ డేట్ కూడా అయిపోవడంతో లాస్ట్ ఛాన్స్ అంటూ మళ్లీ యాడ్స్‌ మార్చేశారు.. దీన్ని బట్టి చూస్తే.. స్వర్గసీమలో ఎవరూ పెద్దగా ప్లాట్లు కొనడం లేదన్న సంగతి తెలిసిపోతుంది.

మూడో పాయింట్‌.. రీజనల్‌ రింగ్‌రోడ్‌కు దగ్గరగా.. అమేజాన్, మైక్రోసాఫ్‌ డాటా సెంటర్ల పక్కనే అన్నట్లుగా బ్రోచర్‌లో చూపిస్తుంటారు. కానీ, ఆ రెండింటికి ఈ వెంచర్‌కు అసలు సంబంధమే లేదు. సైట్‌ ఉన్న ప్రాంతానికి కనుచూపుమేరలో ఎలాంటి డెవలప్‌మెంట్ యాక్టివిటీ మీకు కనిపించదు. కానీ, అక్కడికే అన్నీ రాబోతున్నాయంటూ యాడ్స్‌లో చెప్పేస్తుంటారు చండ్రచంద్రశేఖర్.. ఆయన మాటలు నిజమే కాబోలు అని వెళ్లిన బిగ్‌టీవీ టీమ్‌కు కనిపించిన వాస్తవాలివి.. అంతేకాదు.. సైట్‌ దగ్గరకు వెళ్లే దారి 60 అడుగుల దారంటూ బ్రోచర్‌లో ఉంటుంది. కానీ అది 30 అడుగుల కూడా ఉండదు. కావాలంటే మీరే చూడండి… ఇది చెరుకుపల్లి-విశ్వనాథ్‌పూర్‌ మధ్య ఉన్న రోడ్డు.. గ్రామానికి గ్రామానికి మధ్య ఉండే లింక్ రోడ్ ఇది. ఈ రోడ్డునే 60 ఫీట్ల రోడ్‌ అంటూ చండ్ర చంద్రశేఖర్ ప్రకటనలు ఇచ్చేస్తున్నాడు. పైగా లేఔట్‌ ఈ రోడ్డుకు ఫేస్ చేసి ఉండేది చాలా తక్కువ మాత్రమే. అంటే.. అన్నీ తప్పుడు వివరాలతోనే కస్టమర్లను మాయ చేసి.. బుట్టలో వేసుకుంటున్నారన్నమాట.

.

.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×