MLA Saidi Reddy : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని వీవీ మందిర్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పోలీసులను బెదిరించారు. పోలింగ్ బూత్‌కు అనుచరుతో కలిసి పార్టీ కండువా వేసుకొని వచ్చిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని అడ్డుకున్నారు. దీంతో సైదిరెడ్డి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. నన్నే ఆపుతావా..’ అంటూ గట్టిగా అరిచారు. ‘నీ గొంతు తగ్గించుకో.. లేకపోతే నీ సంగతి చెప్తాను’ అంటూ సిఐని బెదిరించడంతో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సిఐ, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
ఓటింగ్ జరిగే సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన చిహ్నాలు, ఎలాంటి ప్రచారాలు సమీపంలో ఉండకూడదు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం.