EPAPER

Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Group-1 exams: గ్రూప్-1 పరీక్షలో విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.


తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోందని, తుది నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అక్కడే విచారణ జరపాలని ఆదేశించింది. ఫలితాలు వెల్లడించ డానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచన చేసింది.

తెలంగాణాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం ఉదయం విచారణకు స్వీకరించింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు పిటిషన్లలో ప్రస్తావించారు.


అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్, నిరంజన్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు. పరీక్ష జరుగుతుండడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని తేల్చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే విద్యార్థులు పరీక్షా కేంద్రాలను వెళ్లారన్న సీజేఐ. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చేసింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచన చేసింది.

ALSO READ: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!

దీంతో చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు.  సోమవారం నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి, తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

 

 

 

 

Related News

CM Revanth Reddy: ఆ ఒక్క ట్వీట్ తో మనసు దోచేసిన సీఎం రేవంత్.. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే?

Urban development Authority Plan: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!

Inter Student Suicide: బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Police Commemoration: నేరాల తీరు మారుతోంది.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్

Kaushik Reddy: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఏకంగా యాదాద్రి ఆలయంలోనే రీల్స్!

TGPSC Group 1: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత

Big Stories

×