EPAPER

Sunkishala Retaining Wall Collapses: సుంకిశాల ప్రమాదానికి కారణం ఎవరు?

Sunkishala Retaining Wall Collapses: సుంకిశాల ప్రమాదానికి కారణం ఎవరు?

Sunkishala Project Retaining wall Collapse kicks up a Political storm in Telangana: గత ప్రభుత్వం ఏ ముహుర్తాన ప్రాజెక్టులు ప్రారంభించిందో కానీ.. అడుగడుగున వివాదాలే.. ఆ ప్రభుత్వం దిగిపోవడానికి ప్రధాన కారణం నాణ్యతలేని ప్రాజెక్టులే.. ఇప్పుడు మరో ప్రాజెక్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదే సుంకిశాల ప్రాజెక్ట్.. ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ దుమారం రేపుతోంది. అదేలానో చూద్దాం.. ఇది సుంకిశాల ప్రాజెక్ట్‌ వాల్ కూలిపోతుండగా తీసిన వీడియో.. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు.. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ను పట్టించుకోకపోవడం వల్లే రిటెయినింగ్ వాల్ కుంగిందని బీఆర్ఎస్ నేతలుఆరోపిస్తన్నారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టర్ల అవినీతి వల్లే వాల్ కూలిందంటూ కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. సరే లీడర్ల మాటలు కొద్ది సేపు పక్కకు పెడదాం.. అసలు ప్రాజెక్టు ఏంటనేది మాట్లాడుకుందాం. నిజానికి హైదరాబాద్‌ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. మే 14, 2022లో శంకుస్థాపన జరగగా 1,450 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకుంది. తర్వాత ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2,215 కోట్లకు పెంచారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 450 అడుగులకు తగ్గినా.. నీరు తరలించే విధంగా సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని ఇన్‌టేక్‌ వెల్‌కు తరలిస్తారు. రెండో టన్నెల్‌, పంప్‌ హౌజ్‌ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్‌కు గేటు అమర్చేందుకు రిజర్వాయర్‌ వైపున్న మట్టిని తొలగించారు. అదే సమయంలో సాగర్ ఎగువ నుంచి భారీ వరద రావడంతో.. టన్నెల్ గేటు ధ్వంసం అయింది. ఇది అసలు విషయం.


ఇప్పుడు కాంట్రవర్సీ మ్యాటర్ మాట్లాడుకుందాం.. రిటెయినింగ్ వాల్ కుంగి వారం రోజులు గడిచింది. కానీ అధికారులు విషయాన్ని బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే గోడ కూలుతున్న టైంలో కూలీలు తీసిన వీడియో ద్వారా విషయం బయటికి వచ్చింది. మరి ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అంటే… కాంట్రాక్టర్ల పేర్లే వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టును కాంట్రాక్టును మేఘా సంస్థ చేజిక్కించుకుంది. అయితే ఇక్క రక్షణ గోడ నిటారుగా ఉండడంతో ప్రమాదం ఉంటుందని, దానికి అనుసంధానంగా టై భీమ్‌లను నిర్మించాలని ఐదారు నెలల క్రితమే ఇంజనీరింగ్‌ అధికారులు సూచించినా.. నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. అదే సమయంలో గేటు ఏర్పాటుకు రిజర్వాయర్‌ వైపు మట్టి తొలగింపు పనులు చేశారు. దాంతో గేటు ధ్వంసమై, రక్షణ గోడ కూలింది.

Also Read: తెలంగాణలో గ్రీన్‌ డేటా సెంటర్.. రూ. 3,320 కోట్ల పెట్టుబడులు

ఇక ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రాజెక్టు కోసం 300 మందికి పైగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. కానీ అదృష్టవ శాతం అలాంటిది ఏం జరగలేదు. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు మళ్లీ పునర్నిర్మించాలంటే 20 కోట్ల ఖర్చు.. ఈ బడ్జెట్ మేఘా సంస్థే భరిస్తుంది అనుకోండి.. భరించాలి కూడా.. నిర్లక్ష్యం వాళ్లదే కదా.. మరి అసలు సీన్‌ ఇలా ఉంటే.. తమ తప్పును కప్పిపుంచుకోవడానికి కేటీఆర్ మరో ఎత్తు వేశారు. అధికారంలో ఉంది కదా అని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. శ్రీశైలం నుండి వరద వస్తున్న టైంలో గేట్లు బిగించడం సరికాదని చెప్పినా వినకుండా.. ప్రభుత్వం ఆధికారులపై ఒత్తిడి తెచ్చిందన్నారు కేటీఆర్. దాని కారణంగా సుంకిశాల ప్రాజెక్ట్ కుంగిందనిఆరోపించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగితే NDSA 24 గంటల్లో రిపోర్టు ఇచ్చిందని.. సుంకిశాల ప్రాజెక్ట్ కుంగి వారం రోజులవుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బాగుంది.. అంతా బాగుంది. ప్రతిపక్షం కదా.. ఇలా మాట్లాడటం లో తప్పులేదు. కానీ గతం మరిచి మాట్లాడటమే తప్పు అసలు మేఘా కంపెనీకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టబెట్టిందే బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో నిర్మించిన వాటర్ ప్రాజెక్టుల్లో మేఘా సంస్థదే ఫస్ట్ ర్యాంక్..ఇది మర్చిపోతే ఎలా కేటీఆర్ గారు. అందుకే అధికార పక్షం గట్టిగానే తిప్పికొట్టింది. ప్రాజెక్టులో గోడ కూలిన పాపం గత బీఆర్‌ఎస్‌ పాలకులదేనని గట్టిగానే ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క .. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కూడా వదిలిపెట్టలేదని సుంకిశాల ఘటన తేటతెల్లం చేస్తోందని మండిపడ్డారు. డిజైన్ల లోపంతో గోడ కూలితే.. కాంగ్రెస్ రాగానే కూలిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రివర్స్ అటాక్ చేశారు.

నిజమే కదా.. ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోనే లోపాలు అనుకున్నాం.. ఇప్పుడు సుంకిశాల వ్యవహారం బయటకు రావడంతో.. అసలు బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు ఎంత నాణ్యత లోపంతో ఉన్నాయోనని అనుమాలు వస్తున్నాయి. అందుకే సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. నాణ్యత లోపానికి కారకులు ఎవరనేది విచారణలో తేలుతుందని పొన్నం గట్టిగానే చెప్పారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లోపభూయిష్టంగా నిర్మించారని తెలంగాణ ప్రజల ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.

కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ.. ఇలా బీఆర్ఎస్ నిర్మించిన అన్ని ప్రాజెక్టుల్లోనూ నాణ్యత లోపాలే. ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు.. కళ్ల ముందు ఇంత తప్పులు జరుగుతున్నా గత ప్రభుత్వం నేతలు తప్పులు ఒప్పుకోకపోగా.. అధికార పార్టీపై తప్పులు ఎత్తి చూపడం ఎంత వరకు సమంజసం ఇప్పటికైనా తప్పులు ఒప్పుకోండి. జనం ఎలాగో మీ కుర్చీలు మడతపెట్టేశారు. ఇకనైన బురద రాజకీయాలు మాని బాధ్యతగా మేలగండి.. ఎవరి తప్పులు ఏంటో విచారణలో బయటకొస్తాయి అంటున్నారు తెలంగాణ ప్రజలు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×